పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి: పవన్ కల్యాణ్
అమరావతి ఆగష్టు 5
Rulers should be accountable to the people
బలోపేతమైన వ్యవస్థలను గత ప్రభుత్వం ఆటబొమ్మలాగా మార్చుకుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. పరిపాలన ఎలా ఉండకూడదో గత ఐదేళ్ల పాలనలో చూశామని, జగన్ ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని, వ్యవస్థను బతికించాలంటే అన్ని తట్టుకొని ఆత్మస్థైర్యంతో నిలబడ్బామని వివరించారు. కలెక్టర్ల సదస్సులో పవన్ ప్రసంగించారు. ప్రజలు ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకానికి ప్రజాప్రతినిధులు న్యాయం చేయాలన్నారు. ప్రజలకు పాలకులు జవాబుదారీగా ఉండాలని పవన్ కల్యాణ్ సూచించారు. గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఒకే రోజు ఎపిలో 13, 326 గ్రామ పంచాయతీలను ఉపాధి హామీ గ్రామ సభలు నిర్వహిస్తున్నామని వివరించారు. పైలెట్ ప్రాజెక్టుగా తొలుతగా పిఠాపురం నియోజకవర్గంలో చేపడుతామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.