Tuesday, April 21, 2026

సీఎం రేవంత్ రెడ్డి పై ఎంపి డికె అరుణ ఫైర్

- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి పై ఎంపి డికె అరుణ ఫైర్

MP DK Aruna fire on CM Revanth Reddy

హైదరాబాద్
సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ పై ఎంపి  డికె అరుణ మండిపడ్డారు.  సోనియా గాంధీ పుట్టిన రోజే అన్ని హామీలు అమలు చేస్తాం అన్నారు.  ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదు.  ఒక్క ఇల్లు మొదలు  పెట్టలేదు.   కేంద్రం నిధులు లేకుండా వీళ్ళు ఇళ్లు కడతారా..?   రైతు రుణమాఫీ సగం మందికి కాలేదు.  సిగ్గులేకుండా రేవంత్ అబద్ధాలు చెప్తున్నారు.  పక్క రాష్ట్రం కర్నాటకలో డికె శివకుమార్ ఫ్రీ బస్ ఎత్తేస్తాం అంటున్నారు.  గ్రామాలకు బస్సులు బంద్ చేసి  ఫ్రీ బస్ అంటున్నారు .  అన్ని అమలు చేస్తున్నాం అనడానికి సీఎం రేవంత్ కు సిగ్గు ఉండాలి.  ప్రధాని మోడీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల వైఫల్యాలు ఎత్తి చూపారని అన్నారు.  500 రూపాయలకే సిలిండర్ లో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ 375 , మరి మీరిచ్చేది ఎంత..?    ఉజ్వల గ్యాస్ కనెక్షన్ లు అన్ని కేంద్రానీవే కదా.  ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను భ్రమలో ఉంచుతున్నారు.  కానీ ప్రజలు మేల్కొన్నారు . అన్ని అర్దం చేసుకుంటారు.  రైతు భరోసా లేదు, కౌలు రైతులకు , కూలీలకు సాయం దిక్కు లేదు .  కాలేజీ చదివే అమ్మాయిలకు స్కూటీ లు ఎటు పాయే.  11 నెలలో 50 వేల ఉద్యోగాల భర్తీ మాట పెద్ద బోగస్.  10 లక్షల రూపాయల వైద్యం ఈ పది నెలల్లో ఎంతమందికి, ఎక్కడెక్కడ చేయించారో బయట పెట్టండి.  చెప్పిన మాట నిలబెట్టు కోకుండా దబాయించాలని చూస్తున్నారు.   కొత్తగా ఒక ఫించను దరఖాస్తు కూడా తీసుకోలేదు. కొత్త వితంతు ఫించన్లు రాక మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్