Thursday, February 19, 2026

హెల్మెట్ వినియోగంపై అవగాహన – “అలైవ్ అర్రైవ్” కార్యక్రమం విజయవంతం

- Advertisement -

హెల్మెట్ వినియోగంపై అవగాహన – “అలైవ్ అర్రైవ్” కార్యక్రమం విజయవంతం
రోడ్డు భద్రత కోసం అడ్డాకల్ టోల్ ప్లాజా వద్ద అడ్డకల్ పోలీసుల చొరవతో 100 హెల్మెట్ల ఉచిత పంపిణీ
మహబూబ్నగర్

Awareness on helmet use – “Arrive Alive” program a success
జిల్లా పరిధిలోని జాతీయ రహదారి–44 పై రోడ్డు భద్రతను బలోపేతం చేయడం లక్ష్యంగా చేపట్టిన “అలైవ్ అర్రైవ్” కార్యక్రమంలో భాగంగా బుధవారం అడ్డాకల్ టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడ్డాకల్ పోలీసుల ఆధ్వర్యంలో, వెస్ట్రన్ ఆంధ్ర టోల్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించి, భద్రతా చర్యల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేని వాహనదారులకు 100 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో అడ్డాకల్ ఎస్సై శ్రీనివాస్,  సిబ్బంది, అడ్డాకల్ టోల్ ప్లాజా ప్రతినిధి రఘునందన్,  వెస్ట్రన్ ఆంధ్ర టోల్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్