రమణి కళ్యాణం’ మంచి ఫీల్‌గుడ్ మూవీ : జయసుధ
Election Notification for Five States in the Second Week
సూర్య వశిష్ట, దీప్షిక హీరో హీరోయిన్స్ గా విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఎమోషనల్ డ్రామా రమణి కళ్యాణం. కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్ పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి. శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల నిర్మిస్తున్నారు. కోర్ట్ మూవీ ఫేం రామ్ జగదీష్ డైలాగ్స్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ని సహజనటి జయసుధ లాంచ్ చేశారు.
టీజర్ లాంచ్ ఈవెంట్‌లో సహజనటి జయసుధ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ఈ సినిమా నిర్మించిన నిర్మాతలకు అభినందనలు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌లు అద్భుతంగా నటించారు. విజయ్ చాలా ప్యాషన్‌తో ఈ సినిమాను తీశాడు. ఇది ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల్లో కూడా చాలా మంచి సినిమాలు వస్తున్నాయి. ‘రమణి కళ్యాణం’ కూడా అలాంటి మంచి సినిమా. హీరో, హీరోయిన్‌లు చాలా నేచురల్‌గా పెర్ఫార్మ్ చేశారు. మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. నేను ఈ సినిమా చూశాను. ఇది ఒక మంచి ఫీల్‌గుడ్ మూవీ. మే 22న ఈ సినిమా విడుదల అవుతోంది. అందరూ థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను,
హీరో సూర్య వశిష్ట మాట్లాడుతూ.. రమణి కళ్యాణం’ అనే టైటిల్‌లోనే మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి. మా డైరెక్టర్ ఈ సినిమాను ప్రాణం పెట్టి చేశారు. ఇందులో చాలెంజింగ్ రోల్ చేశాను. వీల్ చైర్ కూర్చుని ఎటూ కదలకుండా నటించడం ఒక సవాల్ గా అనిపించింది. దీప్షిక తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. ఇది ఒక క్లీన్ మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. అందరూ థియేటర్స్‌లో చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన జయసుధ గారికి థ్యాంక్యూ
హీరోయిన్ దీప్షిక చంద్రన్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ఈ సినిమా మే 22న థియేటర్స్‌లోకి వస్తోంది. ఇది ఒక అద్భుతమైన కథ. ఇందులో చూపులేని అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. అది సవాల్ తో కూడుకున్న పాత్ర. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కథ విన్న తర్వాత నాకు కలిగిన ఎమోషన్, ఫస్ట్ కాపీ చూసిన తర్వాత కూడా అలాగే అనిపించింది. విజువల్‌గా సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ ఒక హోప్ ఇస్తుంది. ఇది మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే సినిమా. సూర్యతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఈ వేడుకకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన జయసుధ గారికి థ్యాంక్స్. అందరూ ఈ సినిమాను థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను”.
డైరెక్టర్ విజయ్ ఆదిరెడ్డి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఇది మంచి టీమ్ సపోర్ట్‌తో చేసిన సినిమా. ఈ కథను నమ్మి పనిచేసిన అందరికీ థ్యాంక్స్. హీరో, హీరోయిన్‌లు చాలా ప్యాషన్‌తో సహజంగా పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రామ్ జగదీశ్ నా ఫ్రెండ్. ఈ సినిమాలో ఆయన చాలా చక్కని మాటలు రాశారు. నా రైటింగ్ టీమ్ అందరికీ థ్యాంక్యూ. సినిమాలు థియేటర్స్‌లోనే చూడాలి. ఆ అనుభూతి వేరు. అందరూ సినిమాలను థియేటర్స్‌లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. మాకు ఎంతో సపోర్ట్ చేసిన జయసుధ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా చూసి వారు ఇచ్చిన ప్రశంసలు మాకు ఎంతో ఎనర్జీ ఇచ్చాయి. నాకు సపోర్ట్ చేసిన నా స్నేహితులందరికీ థ్యాంక్యూ”
నిర్మాత శ్రీనాథ్ పసుపులేటి మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. మా వేడుకకు విచ్చేసిన సహజనటి జయసుధ గారికి థ్యాంక్యూ. విజయ్ ఈ సినిమాను చాలా ప్యాషన్‌తో తీశాడు. హీరో, హీరోయిన్‌లు చాలా చక్కగా నటించారు. టీజర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా ఉంది. ఇది ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ. ఇందులో చాలా మంచి మ్యూజిక్ ఉంది. తప్పకుండా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు.
నటీనటులు: సూర్య వశిష్ట, దీప్షిక, శ్రీనివాస్ రెడ్డి, శ్యామల, చైతు జొన్నల గడ్డ తదితరులు



