దాత అవయవం లభించే వరకు ఎక్మో ప్రాణాధారం: డాక్టర్ తపస్వి కృష్ణ

- Advertisement -

 

ఎక్మోతో ఊపిరితిత్తుల మార్పిడి.. ప్రాణాపాయ రోగులకు నూతన ఆశలు

దాత అవయవం లభించే వరకు ఎక్మో ప్రాణాధారం: డాక్టర్ తపస్వి కృష్ణ

ECMO is a lifesaver until a donor organ becomes available: Dr. Tapasvi Krishna

కరీంనగర్, జూన్ 19: వాయిస్ టుడే  తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, చివరి దశ ఊపిరితిత్తుల వ్యాధులతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న రోగులను కాపాడటంలో ‘ఎక్మో’ (ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజినేషన్) విధానం కీలక పాత్ర పోషిస్తోందని యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ ట్రాన్స్‌ప్లాంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ తపస్వి కృష్ణ కాత్రగడ్డ తెలిపారు.

కరీంనగర్‌లోని యశోద హాస్పిటల్స్ శాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్న రోగులకు దాత అవయవం లభించే వరకు ఎక్మో ప్రాణాధారంగా పనిచేస్తుందని వివరించారు. చివరి దశ ఇంటర్‌స్టీషియల్ లంగ్ డిసీజ్ (ఐఎల్‌డీ) లేదా తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు ‘వెనో-వీనస్ ఎక్మో’ ద్వారా శరీరం వెలుపలే రక్తానికి ఆక్సిజన్ అందించి, కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించి మళ్లీ శరీరంలోకి పంపుతారని తెలిపారు.

ఈ విధానం ఊపిరితిత్తుల మార్పిడికి ముందు రోగుల ప్రాణాలను నిలబెట్టడంలో అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఎక్మో సపోర్ట్‌పై ఉన్న రోగులకు డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ అని, వైద్యులు, అనస్థీషియా నిపుణులు, ఐసీయూ బృందం సమన్వయంతో మాత్రమే ఇది విజయవంతమవుతుందని చెప్పారు.

శస్త్రచికిత్స అనంతరం ప్రత్యేక క్రిటికల్ కేర్, సమర్థవంతమైన రిహాబిలిటేషన్ ద్వారా రోగులు తిరిగి సాధారణ జీవితం గడపగలరని ఆమె వెల్లడించారు. ఆధునిక వైద్య సాంకేతికతతో ఇప్పుడు ఊపిరితిత్తుల వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు కొత్త ఆశలు చిగురిస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో యశోద హాస్పిటల్స్ మార్కెటింగ్ విభాగం ప్రతినిధులు సుధీర్ రెడ్డి, హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular