NBK111 షూటింగ్‌ లో బాలకృష్ణ కి స్వల్ప గాయమైయింది – గోపిచంద్‌ మలినేని

- Advertisement -

NBK111 షూటింగ్‌ లో బాలకృష్ణ కి స్వల్ప గాయమైయింది – గోపిచంద్‌ మలినేని
Balakrishna sustained a minor injury during the shooting of NBK111 – Gopichand Malineni.
గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణకు స్వల్ప గాయమైయింది. బాలయ్య హీరోగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో #NBK111 రూపొందుతోంది. ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం కాకినాడలో జరుగుతోంది. ఓ కీలక యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తుండగా బాలకృష్ణ కి చిన్న మసిల్ టియర్ అయింది. ఈ విషయాన్ని దర్శకుడు గోపిచంద్ మలినేని సోషల్ మీడియా ద్వారా తెలిజేశారు.
”#NBK111 షూటింగ్ కాకినాడలో జరుగుతున్న సమయంలో ఓ యాక్షన్ సీక్వెన్స్ లో నందమూరి బాలకృష్ణ కి చిన్న మసిల్ టియర్ అయింది.
వైద్యుల సూచన మేరకు, ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవడానికి ఒక చిన్న మైనర్ సర్జరీ చేయాల్సి ఉంది.
సినిమాపై ఆయనకున్న క్రమశిక్షణ, కష్టపడే తత్వం #NBK111 చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది.
అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం”అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘వీర సింహారెడ్డి’ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత బాలయ్య, గోపిచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular