విశ్వనాథ్ & సన్స్’ చిత్రం నుంచి ‘ది వెడ్డింగ్ సాంగ్’ రిలీజ్
‘The Wedding Song’ from the film ‘Viswanath & Sons’ released.
తమిళ అగ్ర కథానాయుడు సూర్య ప్రధాన పాత్రలో ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందిస్తోన్న చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన తొలి గీతం ‘నేనో బటర్‌ఫ్లై’ విశేషంగా ఆకట్టుకుంది. ఆ ఉత్సాహంతో ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్ర బృందం, ‘ది వెడ్డింగ్ సాంగ్’ రూపంలో అభిమానులకు మరో కానుకను తీసుకొచ్చింది. ఈ రెండవ గీతం విడుదలైన తక్షణమే అందరినీ అలరిస్తూ, అసలుసిసలైన వేడుకల గీతంగా ప్రశంసలు అందుకుంటోంది.
ఉత్సాహభరితమైన, పండుగ వాతావరణాన్ని తలపించే ఈ పాటలో.. సూర్య, మమితా బైజు తమ అద్భుతమైన నృత్యంతో తెరపై వెలుగులు నింపుతూ, ఒక ఘనమైన కుటుంబ వివాహంలోని ఆనందాన్ని, ఆత్మీయతను కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ పాటను సూర్య స్వయంగా ఆలపించడం మరింత ప్రత్యేకంగా, హృదయానికి హత్తుకునే సంగీత అనుభూతిగా మార్చింది.
ఈ గీతానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ అద్భుతమైన సంగీత సాహిత్య కలయిక, పాటకు సంబరాల అనుభూతిని జోడించింది.
కేవలం ప్రకటనతోనే ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పోస్టర్లు, టీజర్ ఆకట్టుకోవడంతో పాటు.. ‘నేనో బటర్‌ఫ్లై’, ‘ది వెడ్డింగ్ సాంగ్’ వంటి వరుస చార్ట్‌బస్టర్లతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి.
ఈ కుటుంబ కథా చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా ఆగస్టు 14, 2026 న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా థియేటర్లలో విడుదల కానుంది.
తారాగణం: సూర్య, మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ తదితరులు
విశ్వనాథ్ & సన్స్’ చిత్రం నుంచి ‘ది వెడ్డింగ్ సాంగ్’ రిలీజ్

- Advertisement -
- Advertisement -



