ఎన్నికలు ఎప్పుడు జరిగినా మనదే విజయం
నిత్యం ప్రజలతో మమేకమై పని చేయండని సూచించారు
వైఎస్ జగన్
తాడేపల్లి
Victory will be ours whenever the elections are held: YS Jagan
రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ వైయస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు.
వైయస్ జగన్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు సిద్ధం కండి. గెలుపే లక్ష్యంగా పని చేయాలి. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏ ఒక్క వర్గమూ కూడా సంతోషంగా లేదు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో కనబడకుండా చేసేందుకు పోలీసులను ప్రయోగిస్తారు. – అన్నీ ఎదుర్కొని యుద్ధం చేయాలి. మనకు అత్యంత ప్రజాదరణ ఉంది. అందుకే తప్పకుండా గెలుస్తామని అన్నారు.
రాష్ట్రంలో దారుణంగా దిగజారిన శాంతి భద్రతలు. ఇసుక, మట్టి, మద్యం మాఫియాలు. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన పోలీసులు. ఆ స్థాయికి దిగజారిన వ్యవస్థలు. – ఆ ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు కుట్రలు చేస్తున్నారు. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంకను దారుణంగా చంపారు. కారుతో పదే పదే ఢీకొట్టి ప్రాణం తీశారు. అయినా కేసు బయటకు రాకుండా తొక్కి పెట్టే ప్రయత్నం చేశారని అన్నారు.
అంత దారుణంగా పోలీసులు, అధికార పార్టీ వారు కుమ్మక్కై పని చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచిన వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబునాయుడు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. విద్యార్థులు, రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, ఉద్యోగులు, వ్యాపారులు.. ఇలా ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. అందుకే వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం మీద రెండేళ్లలోనే తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అదే సమయంలో మన వైయస్సార్సీపీపై రోజురోజుకీ ప్రజాదరణ పెరుగుతోంది. అందుకే నాటి గత మన 5 ఏళ్ల పరిపాలనను, ఇప్పుడు వెన్నుపోటు పార్టీ కూటమి పాలనతో పోల్చి చూస్తున్నారు. దీనిపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. మరో ఏడాదిలో నా పాదయాత్ర మొదలవుతుంది. ఆ తర్వాత ఏడాది ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా మనదే విజయం. నిత్యం ప్రజలతో మమేకమై పని చేయండని సూచించారు.




