విమాన ప్రమాదాన్ని అడ్డుకున్న భారతీయ పైలట్
కో-పైలట్ కత్తితో దాడి.. సౌదీలో అత్యవసర ల్యాండింగ్
Indian pilot averts plane crash
దుబాయ్, అక్టోబర్ 1 (వాయిస్ టుడే): దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో కో-పైలట్ కాక్‌పిట్‌లో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై కత్తితో దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దాడి అనంతరం విమానం వేగంగా దిగజారడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. గాయపడినప్పటికీ కెప్టెన్ మచ్ఛర్ కాక్‌పిట్‌ను అదుపులో ఉంచేందుకు ప్రయత్నించినట్లు నివేదికలు తెలిపాయి.
ఈ సమయంలో కొందరు ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి ప్రవేశించి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకోవడంలో సహకరించారు. విమానంలో ఉన్న మరో ఇద్దరు పైలట్లు కూడా విమానాన్ని నియంత్రించడంలో సహకరించినట్లు సమాచారం. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని టబుక్ విమానాశ్రయంలో సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేశారు. సౌదీ అధికారులు కో-పైలట్‌ను అదుపులోకి తీసుకుని ఘటనపై దర్యాప్తు చేపట్టారు.




