ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై తప్పుడు ప్రచారాలకు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి స్పష్టీకరణ
ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై తప్పుడు ప్రచారాలకు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి స్పష్టీకరణ
సూర్యాపేట జిల్లా, అక్టోబర్ 2 (వాయిస్ టుడే ప్రతినిధి):
నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన పేరును పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించిందని రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు స్పష్టం చేశారు.
తన అభ్యర్థిత్వంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తాను టికెట్ అడగలేదని, ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు సిద్ధంగా లేనని, ఎన్నికల నుంచి తప్పుకున్నానని, యూ టర్న్ తీసుకున్నానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
తాను ఎప్పుడూ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పుకుంటానని చెప్పలేదని సర్వోత్తమ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయడం తన స్పష్టమైన నిర్ణయమని తెలిపారు.
పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి నిబద్ధతతో స్వీకరిస్తున్నానని పేర్కొన్నారు. పట్టభద్రులు, యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ, ప్రభుత్వం, సంబంధిత వేదికల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.




