హైదరాబాద్ టైటాన్స్ లయన్స్ క్లబ్ 6వ చార్టర్ నైట్ వేడుకలు
Hyderabad Titans Lions Club 6th Charter Night Celebrations
సికింద్రాబాద్ (వాయిస్ టుడే): లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ టైటాన్స్ 6వ చార్టర్ నైట్ వేడుకలు ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్లోని లయన్స్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు, లయన్స్ ప్రతినిధులు పాల్గొని సేవా కార్యక్రమాలపై చర్చించారు.
కార్యక్రమంలో లయన్ దేపాల దివాకర్ రావు, లయన్ వైలా శ్రీనివాస్ రావు, లయన్ సుధాకర్ పులిపాలుపుల, లయన్ ప్రమోద్ గోపిశెట్టి, లయన్ డాక్టర్ సర్దార్ హర్బిందర్ సింగ్, టైటాన్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ పోలీస్ ప్రదీప్ పటేల్, లయన్ శ్రీనివాస్ సేవెళ్ల, లయన్ రవీందర్ రావు ఆకుల, లయన్ శ్రీనివాస్ పులిపాలుపుల తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 24 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ రాయల్ ప్రతినిధులు, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ టైటాన్స్ 6వ చార్టర్ నైట్ సందర్భంగా క్లబ్ సభ్యులను అభినందించారు.




