జైలు నుంచే ఉన్నత విద్య.. 10 మంది ఖైదీలకు పీజీ పట్టాలు

- Advertisement -

జైలు నుంచే ఉన్నత విద్య.. 10 మంది ఖైదీలకు పీజీ పట్టాలు
Higher education from prison… 10 inmates receive PG degrees.

హైదరాబాద్, అక్టోబర్ 7,
: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవంలో తెలంగాణ జైళ్ల శాఖకు చెందిన 10 మంది ఖైదీలు పీజీ పట్టాలు అందుకున్నారు.

వారిలో 8 మంది ఎం.ఎస్సీ (సైకాలజీ), 2 మంది ఎం.ఏ (సోషియాలజీ) పూర్తి చేశారు. ఇప్పటికే ఎల్‌ఎల్‌బీ, డిగ్రీ, బీటెక్ వంటి విద్యార్హతలు ఉన్న వీరు జైలులో ఉన్న సమయంలోనూ ఉన్నత విద్యను కొనసాగించారు.

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ స్నాతకోత్సవంలో డీఐజీ ప్రిజన్స్ డాక్టర్ డి. శ్రీనివాస్, చర్లపల్లి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ జి. ప్రమోద్ పాల్గొని పట్టాలు అందుకున్న ఖైదీలను అభినందించారు.

విద్య ద్వారా పరివర్తన.. పునరావాసం.. సమాజంలోకి పునఃప్రవేశం అనే లక్ష్యంతో జైళ్ల శాఖ చేస్తున్న కృషికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular