నడిగూడెం శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ లో ఆకట్టుకున్న ముందస్తు బతుకమ్మ వేడుకలు
Early Bathukamma celebrations captivate at Sri Sai Public School, Nadigudem.
నడిగూడెం ,అక్టోబర్ 9(వాయిస్ టుడే ప్రతినిధి) బతుకమ్మ పండుగను పురస్కరించుకొని నడిగూడెం శ్రీ సాయి పబ్లిక్ స్కూల్లో శుక్రవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ఆకట్టుకున్నాయి వివిధ ఆకృతుల్లో రంగురంగుల పువ్వులతో విద్యార్థులు ఉల్లాసంగా బతుకమ్మలను పేర్చి ఆడి పాడారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మహేష్ ప్రిన్సిపాల్ బుస సులోచన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ బోనాలు గుర్తింపు తెచ్చాయని విద్యార్థులకు 9 రోజులు నిర్వహించే బతకమ్మ ప్రాసస్తాన్ని వివరించారు. విద్యార్థులు స్వయంగా 100కు పైగా బతుకమ్మలను పేర్చి సందడి చేశారు అనంతరం స్థానిక చౌదరి చెరువు లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మి రజియా భవాని జ్యోతి,మల్లిక , వీరకుమారి సాజిదా విజయ స్వప్న నాగమణి రాంబాబు సైదులు నాగరాజు సిరాజ్ పాల్గొన్నారు




