- Advertisement -
By ఆముదాల వెంకన్న
డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి ప్రాక్టికల్ శిక్షణ కోసం నలుగురు ప్రొబేషనరీ డీఎస్పీలను ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌కు కేటాయించారు. సోమవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌ను కలిసి సపావత్ దశరథ్, బోయినపల్లి ప్రణయ్ సాయి, వంగా అక్షయ్ కుమార్ రెడ్డి, అఖిలజా రెడ్డి అఖెల్లి రిపోర్ట్ చేశారు. నవంబర్ 23 నుంచి శిక్షణ ప్రారంభమైంది. పోలీస్ శాఖ పనితీరు, క్షేత్రస్థాయి విధులు, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై వారు ప్రాక్టికల్ అనుభవం పొందనున్నారు.
- Advertisement -




