ప్రకృతిని పూజించే సంస్కృతి బతుకమ్మ పండుగకు తంగేడు పూల కొరత….
—-తంగెడు పూలపై పుల్కం ప్రశాంత్ స్నేహ బృందం తీసిన వీడియో వైరల్
చొప్పదండి
A video taken by Pulkam Prashanth Sneha team on Tangedu flowers goes viral
బతుకమ్మ పండుగ సందర్భంగా తంగేడు పూల కొరతపై కరీంనగర్ జిల్లా గంగాధర మండలం చెర్లపల్లి (ఆర్)కి చెందిన పుల్కం ప్రశాంత్ అనే యువకుడు తన స్నేహ బృందం అసునూరి ప్రవీణ్ ,జింక శ్రావణ్,జగిత్యాలకి
చెందిన దైవాల కిషోర్ అనే యువకులు రూపొందించిన వీడియో సామాజిక మాధ్యామాల్లో వైరల్ గా మారింది.
ఒకప్పుడు బతుకమ్మ పండుగంటే సంచులు పట్టుకుని తంగెడు పూలు,గునుక పూలు పలు ప్రకృతి
ప్రసాదించిన రకరకాల పువ్వులు తీసుకుని రావడానకి యువకులు,మహిళలు, ఆడపడుచులు పోయేవారు. గతంలో ఊరి పొలిమేరల్లో కావాల్సినంత తంగేడు పూలు, మక్క పెరడులలో,సేనులలో కావాల్సినంత గునుగు
పూలు పూసేది. పట్టుకుచ్చులు వాకిట్ల, పెరట్లలల్ల విరగబూసేది, ఊరి పొలిమేరలు రియల్ ఎస్టేట్ తో ప్లాట్లుగా మారిపోయినాయి. పెరట్లల్లో కొట్టే గడ్డిమందుకు గునుగు పువ్వు సచ్చిపోయింది, గత సంవత్సరం 100
రూపాయలు ఖర్చు చేసిన పిరికెడు తంగేడు పూలు దొరకలేదు. మహిళలు సాంప్రదాయ బద్దంగా భక్తి శ్రద్ధలతో రోజు ఆడే బతుకమ్మ ఆటలకు, చివరిరోజు జరుపుకునే బతుకమ్మ పండుగకు బతుకమ్మ పేర్చాడానికి
పువ్వు లేకుండా చేసుకున్న కాలం మనదని 9 వ రోజు బతుకమ్మ వచ్చేసరికి గునుగు, తంగేడు కోసం మనం పడుతున్న కష్టాలని దృష్టిలో ఉంచుకుని మన పెరట్లో పూసిన పువ్వు తెంపుకోవాల్సిన మనం , డబ్బులు
పెట్టి కొనుక్కునే రోజులకి వచ్చాం అని,దీంతో మార్కెట్లో ఈ పూల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని పకృతిని కాపాడుకోవాలని కనువిప్పు కలిగించేందుకు స్మగ్లర్ లు వజ్రాలు, బంగారం ఎలా తీసుకోని ఎవరికంట
పడకుండా ఇతరులకు ఇచ్చి వ్యాపారం ఎలా చేస్తారో బాలీవుడ్ సినిమా మాదిరిగా ఈ వీడియో తీయడం జరిగిందని నిర్వాహకుడు పుల్కం ప్రశాంత్ పలువురు ఇందులో నటించిన యువకులు తెలిపారు. ఇన్
స్టాగ్రామ్,ఫేస్ బుక్ లో,సోషల్ మీడియా లో, యూ ట్యూబ్ లో ఈ వీడియో గత 4 రోజులుగా చక్కర్లు కొడుతూ ప్రేక్షకులని ఆకట్టుకుంటు చైతన్యాన్ని కలిగిస్తంందని తెలిపారు.


