కడప జిల్లా ఎస్పీగా అశోక్ కుమార్
Ashok Kumar as the SP of Kadapa district
నాడు డీఎస్పీగా పని చేసిన చోటే ఇప్పుడు ఎస్పీ
అప్పట్లో రౌడీ షీటర్ల పై ఉక్కు పాదం
బద్వేలు
ఉపాధ్యాయుడుగా పనిచేసి బెత్తం పట్టుకొని విద్యార్థులను బావి భారత పౌరులుగా తయారు చేసేందుకు కృషి చేశారు. ఇలాంటి వ్యక్తి బెత్తం వదిలిపెట్టి లాటి పట్టుకున్నారు. పోలీస్ శాఖలో చేరెందుకు ఆయన చాలా కష్టపడ్డారు. అనుకున్న లక్ష్యం సాధించారు. కడప డీఎస్పీగా అప్పట్లో పనిచేశారు. ఇప్పుడు ఆ జిల్లాకే ఎస్పీగా వస్తున్నారు. కడప డీఎస్పీగా ఉన్నప్పుడు రౌడీల
పని పట్టారు. ఎర్రచందనం రవాణా ఆట కట్టించారు. ఎర్రచందనం అక్రమంగా రవాణా చేసే పెద్ద మనుషుల పని పట్టా.రు సుమారు మూడు సంవత్సరాల పాటు కడప డీఎస్పీగా పని చేశారు. అనంతపురం జిల్లా నార్పాల గ్రామానికి చెందిన అశోక్ కుమార్ చాలా బాధ్యతగల పోలీసు అధికారి. ప్రభుత్వం సోమవారం రాత్రి పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. కడప ఎస్పీగా అశోక్ కుమార్ ను నియమించారు. కడపలో ఎస్పీగా పనిచేస్తున్న హర్షవర్ధన్ రాజు
గత ఏడాది నవంబర్ ఎనిమిదో తేదీ బదిలీ చేసింది. ఈ బదిలీల్లో ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుపతి ఎస్పీగా నియమించారు. కడప ఎస్పీగా ఉన్న హర్షవర్ధన్ రాజు బదిలీ కావడంతో ఆయన స్థానంలో ఇంచార్జ్ ఎస్పీగా అన్నమయ్య జిల్లా
ఎస్పీ విద్యాసాగర్ నాయుడు నియమించారు. కడప ఎస్పీగా వస్తున్న అశోక్ కుమార్ 2014 నవంబర్ 18వ తేదీ నుండి 2017 ఆగస్టు రెండో తేదీ వరకు కడప డీఎస్పీగా పనిచేశారు. ఒకటి రెండు రోజుల్లో కడప జిల్లా ఎస్పీగా అశోక్ కుమార్ బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం