- Advertisement -
అవగాహన అప్రమత్తతే కీలకం
Awareness is key
డాక్టర్. ఎండి. తిరుపతిరావు
కరీంనగర్
అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్ధత దినోత్సవం
ఏటేటా ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధులు ఇన్ఫెక్షన్ డిసీజెస్, ప్రబలుతూ ప్రజలను భయానికి గురిచేస్తున్నాయి. ఇవి ఒక వ్యక్తి నుంచి మరొకరికి వ్యాప్తిచెందుతూ నిరంతరం సవాల్‌గా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు వివిధ రంగాల్లో పరస్పరం అను సంధానించబడటంతో వ్యాధులు కూడా సరిహద్దులు దాటుతున్నాయి. పరస్పర సమన్వయంతో ప్రపంచం మొత్తంగా వీటి నియంత్రణకు కృషిచేయాల్సిన ఆవశ్యకత నేడు పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యుహెచ్ఒ, ఆ దిశగా పరిశోధనలు, నియంత్రణకు కృషి చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే 17 లక్షల వైరస్‌లు ఉన్నట్లుగా సమాచారం. ఇవి ముఖ్యంగా జంతువులు, పక్షులకు వ్యాప్తిస్తున్నాయి. ఇవి ఎప్పుడైనా మానవాళి పై ప్రభావాన్ని చూపించొచ్చు. ఇప్పటికే పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా ప్రకంపనలు సృష్టిస్తోంది. జికా వైరస్, ఇంకా డింగా డింగా జబ్బు నేడు భయ పెడుతున్నాయి. కరోనా-19 మనకు అనేక పాఠాలు నేర్పింది. ఆరోగ్యపరంగా మనం ఎలా ఉండాలో, ఏయే జాగ్రత్తలు పాటించాలో ప్రపంచ పౌర సమాజానికి తెలియజెప్పింది. డబ్ల్యుహెచ్ఒ ఏటేటా డిసెంబర్ 27న అంతర్జాతీయ అంటువ్యాధి సంసిద్ధత దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. అంటువ్యాధులు-పరిశోధనలు- నివారణా మార్గాలు.. అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయటం ఈ కార్యక్రమం ప్రధానోద్ధేశ్యం.
అంటువ్యాధులను ఇలా చూడొచ్చు
అంటు వ్యాధులను రెండు రకాలుగా వర్గీకరించొచ్చు. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందేవి. ఇవి సూక్ష్మక్రిములు బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, పరాన్న జీవికి సంబంధించిన జబ్బులు. రెండోది అంటువ్యాధి కాకుండా మిగిలిన జబ్బులు. ఇవి మొత్తం జీవన శైలికి సంబంధించినవి.
ఉదా:షుగర్, గుండె జబ్బులు, బిపి.
మానసిక వ్యాధులు:డిప్రెషన్, యాంగ్జైటీ,
వాతావరణంతో వచ్చే జబ్బులు ఫుడ్ పాయిజన్, కలుషిత నీటి వ్యాధులు
ఆహార లోపంతో వచ్చే జబ్బులు న్యూట్రీషనల్ డిసీజెస్, ఊబకాయం, విటమిన్ లోపంతో వచ్చేవి.
ఎలా వ్యాప్తి చెందుతాయంటే,
అంటువ్యాధులు మానవ నిర్లక్ష్యంతో కూడా వస్తుంటాయి. అందువల్ల ముందస్తు గా జీవనశైలికి సంబంధించిన మార్పులు, జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వాటి బారి నుంచి దూరంగా ఉండొచ్చు. అయితే ఎపిడమిక్స్ అంటువ్యాధులు, ఎండమిక్స్ ప్రదేశం వాతావరణం, పాండమిక్ మహమ్మారి,గా చెప్పుకోవచ్చు.
ఎపిడమిక్స్ : ఒకే సమయంలో ఒకే ప్రాంతంలో ఏదైనా ఒక వ్యాధి ఎక్కువగా నమోదు అవ్వడాన్ని ఎపిడమిక్ అంటారు. ఉదా: వర్షాకాలంలో డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా రావటం
ఎండమిక్స్ : ఏదైనా ఒక ప్రాంతంలో ఒక వ్యాధి సంవత్సరం పొడగునా వ్యాప్తి చెందటం ఉదా : మలేరియా
పాండమిక్ : ఏదైనా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి ఒకేకాలంలో నమోదు కావటం. ఉదా: కోవిడ్ 19. ఇది అనేక దేశాల్లో ఒకేసారి అనేక మందికి వ్యాప్తి చెందింది.
ఎండమిక్ జబ్బులు ఏడాది పొడవునా కన్పిస్తాయి. ఎఫెండమిక్, పాండమిక్ మాత్రం సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే ఉండి తగ్గిపోతాయి. ఎండమిక్ సంసిద్ధతలో మనం ముఖ్యంగా ఒక వ్యాధి గురించి ఎలా వ్యాప్తి చెందుతుందో తెలుసుకొని వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.
దీనికి ముఖ్యంగా కావాల్సిన ప్రణాళికను తయారుచేసుకోవటం, దానిని ఆచరణల్లో పెట్టడానికి తగిన ఏర్పాట్లు చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యుహెచ్ఒ, సంస్థ కృషిచేస్తూ ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు తమవంతుగా కృషిని కొనసాగిస్తుంటాయి.
అరికట్టడమే ముఖ్యం
ముందుగా అంటువ్యాధి ప్రబలుతుందని గుర్తించటం, ఆ తర్వాత ప్రభుత్వ యంత్రాంగం ఆరోగ్య సంస్థల ద్వారా తగిన పరీక్షలు నిర్వహించి ఆ వ్యాధిని గుర్తిస్తారు. వ్యాధిని గుర్తించిన తర్వాత దాంతో వచ్చే పరిణామాలు, దుష్పరిణామాలు గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా ఆ వ్యాధి ఎక్కువగా ప్రబలకుండా విస్తృత ప్రచారం చేయటం, నియంత్రణ చర్యలు చేపట్టి ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఇబ్బంది పడకుండా చూస్తూ ఉంటారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు సమన్వయంతో ఆ వ్యాధి గురించి పరీక్షలు చికిత్స చేసే విధానం గురించి తోడ్పాటును అందించుకుంటూ ఉంటాయి. వ్యాధికి సంబంధించిన పరిశోధనల్లో టీకాలు, చికిత్సకు కావాల్సిన పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటాయి. వ్యాధి తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్లీ ప్రబలకుండా దాని గురించి పర్యవేక్షణ జరుపుతూ ఉండాలి.
సన్నద్ధత కూడా ముఖ్యమే
అంటువ్యాధులను నివారించేందుకు డబ్ల్యుహెచ్ఒతో పాటు ప్రపంచంలోని పలు దేశాలు పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నాయి.
- Advertisement -