Thursday, April 24, 2025

దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయు భోగ శ్రావణి సవాల్…

- Advertisement -

దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయు…

దొంగరాత్రి కాంగ్రెస్ కండువా కప్పుకున్నది వాస్తవం కదా..?

Bhoga Sravani challenges you to resign from the post of MLA if you dare...

డబుల్ బెడ్ రూం ఇండ్లు కాంట్రాక్టర్లు
మీ బంధువులే కదా
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సమాధానం చెప్పాలి
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు  భోగ శ్రావణి సవాల్…

జగిత్యాల,
: ప్రజల తీర్పు,కార్య కార్యకర్తల శ్రమను లెక్కచేయకుండా ఒక పార్టీ నుంచి గెలిచి స్వలాభం కోసం మరో పార్టీలోకి జంప్ అయినా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మీకు దమ్ముంటే రాజీనామా చేసి ప్రజల తిర్పును కోరాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి సవాల్ విసిరారు.బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కమల నిలయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ భోగ శ్రావణి విలేకరుల సమావేశంలో మాట్లాడారు మాజీ ఎమ్మెల్సీ
జీవన్ రెడ్డి టీడీపీకి, మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి,రాజీనామా చేసి  కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని శ్రావణి తెలిపారు.నేను జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పదవికి, అధికార టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ప్రతిపక్ష బిజెపి పార్టీలో గౌరవప్రదంగా చేరాననీ శ్రావణి గుర్తు చేశారు.
మరి మీరు..దొంగ రాత్రి  కాంగ్రెస్ పార్టీలో చేరారనీ.. కార్యకర్తలు, నాయకులకు చెప్పకుండా
బీఆర్ఎస్ ను విడడం న్యాయమేనా అనీ శ్రావణి ప్రశ్నించారు.
2018 లో లక్ష ఓట్లు వచ్చాయనీ  గర్వంగా చెప్పుకున్నారు కదా, 2023 లో 40 వేల ఓట్లు ఎందుకు తగ్గాయనీ,
కోట్లు ఖర్చు పెడితే 8% ఓట్ల తేడాతో గెలిచారు…. మరి అప్పటికీ ఇప్పటికీ ఓట్ల శాతం  ఎందుకు తగ్గిందనీ నీలాదిశారు.మీరు అనుభవిస్తున్న  పదవి ప్రజల బిక్ష, నిన్ను నమ్మిన కార్యకర్తల కష్టం,
మిమ్మల్ని గెలిపించిన నాయకులు జైలులో ఉoటే వాళ్ళను మర్చిపోయి దొంగరాత్రి  బిల్లుల కోసం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నీతులు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు.
నిన్ను నమ్మిన వారి ఆత్మ గౌరవాన్ని పార్టీ కార్యకర్తల నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టిన
సంజయ్ కుమార్ ది తెరిచినా పుస్తకం కాదు రాక్షస పాలనఅంటూ ఎమ్మెల్యే తీరుపై  శ్రావణి  మండిపడ్డారు.
జగిత్యాలలో కక్ష సాధింపు రాజకీయాలు చేయడం మీతోనే సాధ్యమన్నారు.
2017లో భూమి పూజ చేసిన డబుల్ ఇల్లు ఇప్పటి వరకు పూర్తికాలేదనీ,మీ బంధువులే కదా కాంట్రాక్టర్లు ఎందుకు చేయలేదో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సమాధానం చెప్పాలని శ్రావణి ప్రశ్నించారు.
4 వేల నుండి 43 వేల ఓట్లు మా కార్యకర్తల కష్టం, పార్టీ సపోర్ట్, ప్రజలు దీవించి ఇచ్చిన గౌరవప్రదమైన తీర్పు  అనీ శ్రావణి అన్నారు.
స్థానం గురించి మాట్లాడుతున్నా ఎమ్మెల్యే ప్రజలు నీపై ఉన్న అభిప్రాయం ఇటీవల జరిగిన సర్వేలో మిమ్మల్ని 108వ స్థానంలో ఉంచారనీ అది గుర్తుపెట్టుకుని మాట్లాడండనీ హితవు పలికారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఏ పార్టీ నుండి టికెట్ తెచ్చుకుంటావో, నేను బిజెపి తరపున నిలుచుంటా, పోటీ చేస్తా, ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రా అనీ శ్రావణి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు సవాల్ చేశారు.
ఇటీవల కొన్ని మీడియా పత్రికల్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్థాయి గురించి మాట్లాడినందుకు గాను  బోగ శ్రావణి  ఎమ్మెల్యే  మాటలకు చురకలు అంటించారు.ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నా జగిత్యాల ప్రజలు ఎమ్మెల్యేకి రాబోయే కాలంలో తగిన బుద్ధి చెబుతారనీ శ్రావణి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, పట్టణ ప్రధాన కార్యదర్శి సిరికొండ రాజన్న,మహిళ మోర్చా ప్రదాన కార్యదర్శి సాంబరి కళావతి,మహిళ మోర్చా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత, పట్టణ ఉపాధ్యక్షులు పవన్ సింగ్, సింగం పద్మ, కాశెట్టి తిరుపతి, గడ్డల లక్ష్మి ఇట్యాల రాము, నాయకులు  పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్