- Advertisement -
బైకు, డీసీఎం ఢీ..ముగ్గురు మృతి
Bike and DCM collision..Three killed
నల్లగొండ
దేవరకొండ పట్టణంలోని మల్లేపల్లి రోడ్డులో వున్న దర్గా దగ్గర ఒక డీసీఎం మితిమీరిన వేగంతో బైక్ ని ఢీకొట్టింది. దాంతో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికి అక్కడే మరణించారు. మృతులు దేవరకొండ మండలం, తాటికొల్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. దర్గా నుంచి దేవరకొండ పట్టణం వైపు వస్తున్న బైక్ ని.. వెనుకనుండి వచ్చినా డీసీఎం బలంగా ఢీకొట్టింది. మృతులలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ వున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -