ఎంపి ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టాలి
కేటీఆర్
మేడ్చల్
మేడ్చల్ నియోజకవర్గంలో జరిగిన విజయోత్సవ సభలో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు.
కేటీఆర్ మాట్లాడుతరూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారెంటిలు అమలు చేస్తా అని అంటున్నాడు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి చెక్ పెట్టాలి, కృష్ణా గోదావరి జీవ నదులు, కృష్ణా లో మన వాటాను బీజేపీ కేంద్ర ప్రభుత్వం తేల్చలేదు. మన వాటా చెప్పకుండానే ఆ బోర్డుకు మన కృష్ణా జలాలను తాకట్టు పెట్టారు. మల్లారెడ్డి తో పోటీ పడే పరిస్తితి ఎవరికి లేదు. ప్రజల కోసం పని చేసే నాయకుడు మల్లారెడ్డి. 420 హామిలు ఇచ్చిన రేవంత్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలి. మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు 2 లక్షలు లోన్ తీసుకోమన్నారు నేను మాఫీ చేస్తా అన్నారు మాఫీ ఎటుపోయిందో. కోటి 57 లక్షల మంది ఆడ బిడ్డలు 2500 కోసం వేచి చూస్తున్నారని అన్నారు.
ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు కడుపుకొట్టరు. ఆరు గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని, 420 హామీలు అమలు చేస్తా అన్నారు. రేవంత్ లాంటి వాళ్ళను చాలా మందిని చూసాము. ఎంతో మంది తిస్మార్ ఖాన్ లను మాయం చేసి తెలంగాణా తెచ్చారు కేసీఆర్. ఎవరికి అన్యాయం జరిగిన అందరం బస్ వేసుకొని వస్తాము. మన బాస్ లు ఢిల్లీ, గుజరాత్ లో లేరు. తెలంగాణ మాట ఢిల్లీ లో వినబడాలి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు ఓటు వేయాలి. ప్రశ్నించే గొంతుక అని మల్కాజ్ గిరి ఎంపి అయ్యారు. ఎంపీ గా రేవంత్ ఏమి చేయలేదు. లంకె బిందెల కోసం వెతికే వారు అధికారంలోకి వచ్చారు. సెక్రటేరియట్ లో కంప్యూటర్ లు, పేపర్లు ఉంటాయి, లంకె బిందెలు ఉండవు. మేము ప్రజల తరుపున పోరాడుతాము, కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని వారు నెరవేర్చే వరకు పోరాడుతాం. రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక వచ్చిన గులాబీ జెండాకు ఓటు వేస్తేనే మన గొంతుక ఉంటదని అన్నారు.
ఎంపి ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టాలి
- Advertisement -
- Advertisement -