27.7 C
New York
Thursday, June 13, 2024

కేసీఆర్ కు ఫీవర్….  వచ్చేవారం కేబినెట్ మీటింగ్?

- Advertisement -

కేసీఆర్ కు ఫీవర్….  వచ్చేవారం కేబినెట్ మీటింగ్

హైదరాబాద్, సెప్టెంబర్ 29:   తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వైరల్ ఫీవర్ తగ్గకపోడవంతో ఈ రోజు జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిాద డింది. ల శుక్రవారం మధ్యాహ్నం సెక్రటేరియెట్‌‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్టు అనధికారికంగా సమాచారం ఇచ్చారు. కేసీఆర్ వైరల్ ఫీవర్‌‌‌‌తో బాధ పడుతున్నారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతో కేబినెట్ భేటీని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. అక్టోబర్ మొదటి వారంలో తిరిగి కేబినెట్ సమావేశం నిర్వహించే అవకాశం ఉందని ప్రగతి భవన్ వర్గాలు చెప్తున్నాయి ఎన్నికల షెడ్యూల్ వచ్చే గడువు దగ్గర పడుతూండటంతో అధికార బీఆర్‌ఎస్‌ అందుకనుగుణంగా  స్పీడు పెంచుతోంది. ఎలక్షన్‌ తాయిలాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ ఓటర్లకు మరిన్ని హామీలివ్వనున్నారు. ఈ హామీలు, తాయిలాలపై చర్చించేందుకోసం ఈనెల 29న రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా భేటీ కానుంది. ప్రస్తుత సర్కారుకు దాదాపు ఇదే ఆఖరి క్యాబినెట్‌ కానుంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఇటీవల ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. వీటిపై విస్తృత ప్రచాతరం చేస్తున్నారు. వాటికి ధీటుగా బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోను రూపొందించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. గత ఎన్నికల్లో పింఛన్‌దారులు, రైతులు గెలిపించారు. ఈసారి కూడా వారే తమ పార్టీని ఆదుకుంటారని కేసీఆర్‌ భావిస్తున్నారు. అందువల్ల ఆసరా పింఛన్ల పెంపు, రైతు బంధు కింద ఇచ్చే ఆర్థిక సాయం పెంపు తదితరాంశాలను ఎన్నికల ప్రణాళికలో ఆయన చేర్చనున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. నామినేటెడ్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా గతంలో మంత్రివర్గం సిఫారసు చేసిన దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణ పేర్లను గవర్నర్‌ డాక్టర్‌ తమిళి సై సౌందర రాజన్‌ తిరస్కరించారు. అయితే కేసీఆర్ మాత్రం వారి అభ్యర్థిత్వాల విషయంలో వెనక్కి తగ్గకూడదని అనుకుంటున్నారు.  మరోసారి క్యాబినెట్‌ వారి పేర్లను ఆమోదించి, గవర్నర్‌కు తిరిగి సిఫారసు చేయాలని అనుకుంటున్నారు. వీరిద్దరిపై ఎలాంటి కేసులు లేవు. రాజకీయ నేతలు అయి ఉండవచ్చు కానీ దాసోజు శ్రవణ్ ఫ్రొఫెసర్ అని.. కుర్రా సత్యనారాయణ కార్మిక వర్గాల నేత అని చెబుతున్నారు. వారిద్దరూ గవర్నర్ కోటాలో అర్హత ఉందని చెబుతున్నారు. ఏదైనా ఫైల్ గవర్నర్ తిరస్కరించినప్పుడు అదే ఫైల్ నుంచి రెండో సారి పంపితే ఖచ్చితంగా ఆమోదించాల్సి ఉంటుందని చెబుతున్నారు. గవర్నర్‌కు అంతకు మించి అధికారాలు ఉండవని టీఆర్ఎస్ నేతలు కూడా భావిస్తున్నారు.  ఉద్యోగుల డీఏ పెంపు, వారికి సంబంధించిన ఇతర ప్రధానాంశాలు ఎన్నికల ప్రణాళికలో ఉండబోతున్నాయి. 2018లో ముందస్తు ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్‌ ‘నిరుద్యోగ భృతి’ని ఇస్తామంటూ ప్రకటించింది. కానీ అమలు చేయలేదు. అందుకే రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం ఏదైనా ఒక పథకాన్ని ప్రవేశపెట్టే అవకాశముంది. దళిత బంధు, బీసీ, మైనారిటీ బంధు పథకాలు తమకు రాజకీయంగా లబ్ది చేకూరుస్తాయని భావిస్తున్న సీఎం కేసీఆర్‌… వాటి తరహాలోనే మహిళా బంధు పథకానికి రూపకల్పన చేయబోతున్నారని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వచ్చే ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజయ్యే అవకాశం ఉంది. ఆలోపే మంత్రివర్గ భేటీని కేసీఆర్ పూర్తి చేస్తారని చెబుతున్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!