మూసీ నది ప్రక్షాళన…13 వేల ఇండ్లు గుర్తింపు

- Advertisement -

మూసీ నది ప్రక్షాళన…13 వేల ఇండ్లు గుర్తింపు: సిఎం రేవంత్
హైదరాబాద్ సెప్టెంబర్ 25

Cleaning of Musi river…13 thousand houses identified

మూసీ రివర్ బెడ్లో, ఎఫ్ టిఎల్, బఫర్ జోన్ లో ఉన్న ఇళ్లను తొలగింపుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మూసీ నది ప్రక్షాళనకు సర్కార్ చర్యలు తీసుకుంటుందని రేవంత్ స్పష్టం చేశారు. సర్వేలో 13 వేల ఇండ్లు ఉన్నట్టు అధికారులు గుర్తించామని వాటిని తొలగిస్తామన్నారు. మూసీ పరిసర ప్రాంతాల తహసీల్దార్లతో హైదరాబాద్ కలెక్టర్ మీటింగ్ ఉంటుందని వివరించారు. మూసీ పరివాహక ప్రాంత ఇళ్లకు అతి త్వరలో అధికారులు నోటీసులు జారీ చేస్తారని తెలియజేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular