- Advertisement -
ఇస్రో ప్రయోగం విజయవంతం పై సీఎం రేవంత్ హర్షం
CM Revant Harsha on the success of the ISRO experiment
హైదరాబాద్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) 100వ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిరు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని అభివర్ణించారు. మిషన్ విజయవంతం కావడానికి అంకితభావంతో కృషి చేసిన ఇస్రో బృందాన్ని సీఎం అభినందించారు. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఇస్రో ప్రయోగించిన జీఎస్ఎల్వీ – ఎఫ్15 రాకెట్ నావిగేషన్ ఉపగ్రహం ఎన్వీఎస్ – 02ను నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ 100వ మైలురాయిని చేరుకోవడం భారతదేశ అంతరిక్ష కార్యక్రమం పటిమను ప్రపంచానికి చాటినట్లయిందని ముఖ్యమంత్రి ప్రశంసించారు
- Advertisement -