- Advertisement -
సీఎస్ ఆర్ నిధుల రచ్చ
CSR funding frenzy
హైదరాబాద్, నవంబర్ 25, (వాయిస్ టుడే)
సీఎస్ ఆర్ నిధుల వినియోగం సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో రాజకీయ వేడి రాజేస్తుంది. జిల్లా అభివృద్ధికి సీఎస్ ఆర్ నిధులు వాడుతుంటే అధికారపార్టీకే చెందిన ఒక ఎమ్మెల్యే మోకాలొడ్డుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మంత్రి చొరవతో పరిశ్రమల యాజమాన్యాలు అభివృద్ధి పనుల్లో పాలుపంచుకుంటూ.. సీఎస్ ఆర్ నిధులు వినియోగిస్తుంటే.. ఎమ్మెల్యే వెళ్లి కలెక్టర్‌న కలవడం హాట్ టాపిక్‌గా మారింది. ఆ క్రమంలో ఎమ్మెల్యేపై ఇటు మంత్రి అనుచరులు.. అటు సొంత పార్టీ నాయకులు కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు. అసలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటి ఫండ్ కాస్త పొలిటికల్ రంగు ఎందుకు పులుముకుంది?. ఇంతకీ ఆ ఎమ్మెల్యేకి వచ్చిన బాధేంటి?సంగారెడ్డి జిల్లా పరిశ్రమలకు పెట్టింది పేరు. తెలంగాణలోనే ఎక్కువ పరిశ్రమలు ఈ జిల్లాలోనే ఉన్నాయి. మరి ముఖ్యంగా పటాన్ చెరు నియోజకవర్గంలో ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ ఉంది. IDA బొల్లారం, పాశా మైలారం, కాజీపల్లి, పటాన్ చెరులాంటి ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయి. వీటితో పాటు జిల్లాలో సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాలతో పాటు హత్నూర మండలంలోను పరిశ్రమలు నడుస్తున్నాయి. ఇక్కడ పొల్యూషన్ ఎక్కువగా ఉండటంతో ప్రజలు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.అయితే సీఎస్ ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటి కింద పరిశ్రమలు నిధులు ఇస్తూ ఉంటాయి. పరిశ్రమ లాభాల్లో రెండు శాతం పరిశ్రమల శాఖకు ఇవ్వాల్సి వుంటుంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ అకౌంట్ నిర్వహిస్తారు. పరిస్థితుల్ని బట్టి పరిశ్రమలతోనే కొన్ని చోట్ల అభివృద్ధి పనులు చేయిస్తూ ఉంటారు. ఈ సీఎస్ ఆర్ నిధులను జిల్లాలో ఎక్కడైనా అభివృద్ధి పనులు చేయించే అధికారం జిల్లా కలెక్టర్ కి ఉంటుంది.2023 డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరాక జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ జిల్లా స్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న పలు అభివృద్ధి పనులకు సీఎస్ ఆర్ ఫండ్స్ వినియోగించి పనులు చేయాలని జిల్లా అధికారులకు మంత్రి ఆదేశాలు ఇస్తున్నారు. ఇండస్ట్రీ మేనేజ్‌మెంట్ లతో కొన్ని సార్లు మంత్రి కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జిల్లా అభివృద్ధిలో పరిశ్రమ యాజమాన్యాలు భాగస్వామ్యం కావాలని సూచిస్తున్నారు .. తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.మంత్రి చొరవతో జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలో ప్రహరీ నిర్మాణాలు, పోలీసులకు టాస్క్ ఫోర్స్ బైకులు, విద్యార్థులకు మంచి నీళ్ళ కోసం వాటర్ ప్లాంట్ లు నిర్మించి ఇచ్చాయి పరిశ్రమ వర్గాలు. ఇక్కడి వరకు అంతా సాఫీగా ఉన్న పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నిధులు తన నియోజకవర్గానికి కాకుండా వేరే నియోజకవర్గానికి కేటాయించడంపై అసంతృప్తిగా ఉన్నారట. ఇదే విషయంపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి దగ్గరకు వెళ్లి వినతిపత్రం ఇచ్చారట.పటాన్ చెరు నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమల నుంచి వచ్చే సీఎస్ ఆర్ ఫండ్స్ తమ నియోజకవర్గ అభివృద్ధికే కేటాయించాలని ఎమ్మెల్యే తన వినతిపత్రంలో కోరారంట. పరిశ్రమలతో ఎక్కువ నష్టం పటాన్ చెరు నియోజకవర్గానికే జరుగుతుందని అందుకే ఆ నిధులు నియోజకవర్గానికే కేటాయిస్తే బాగుంటుందని అభిప్రాయ పడ్డారట ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. అయితే ఆ విషయాన్ని మంత్రి దామోదర దృష్టికి తీసుకెళ్లకుండా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో కాంగ్రెస్ పార్టీలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయట. ఎమ్మెల్యే, మంత్రి దామోదర మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న చర్చ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా జరుగుతుందిమరో వైపు సీఎస్ ఆర్ నిధుల రచ్చపై మంత్రి అనుచరులు ఎమ్మెల్యేకు కౌంటర్ ఇస్తున్నారట. గతంలో BRS హయాంలో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి జిల్లాలు విడిపోయినప్పుడు ఇక్కడి సీఎస్ ఆర్ నిధులు సంగారెడ్డి నుంచి పక్క జిల్లా సిద్ధిపేటకి వెళ్లిన సంగతి మరిచిపోయారా అని దెప్పిపొడుస్తున్నారు. జిల్లా అభివృద్ధికి మంత్రి కంకణం కట్టుకుని పనిచేస్తుంటే.. మహిపాల్‌రెడ్డి మోకాలొడ్డటం సరికాదని సలహా ఇస్తున్నారట. ఇలా సొంత పార్టీ ఎమ్మెల్యేకే కాంగ్రెస్ నాయకులు కౌంటర్లు ఇస్తుండటంతో ఎమ్మెల్యే వర్గం డిఫెన్స్ లో పడిపోయిందన్న ప్రచారం జరుగుతుంది. అయితే జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఎమ్మెల్యే అనుచరులు చెబుతున్నారట. సీఎస్ ఆర్ ఫండ్స్ కి సంబంధించిన అంశాలు జిల్లా కలెక్టరే చూస్తారు కాబట్టి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు తప్ప అందులో రాజకీయం కోణం లేదని కొట్టిపారేస్తున్నారట.ఏది ఏమైనా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సీఎస్ ఆర్ నిధుల విషయంలో మంత్రిని కాకుండా కలెక్టర్ ని కలవడం జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది ఎమ్మెల్యే ఏ ఉద్దేశ్యంతో వెళ్లినా ఎవరికి వారు నచ్చినట్టుగా ఊహించుకుంటూ ప్రచారాలు మొదలుపెడుతున్నారు. మొత్తానికి సీఎస్ ఆర్ ఫండ్స్ తో మొదలైన ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా ఇంకా కంటిన్యూ అవుతుందా అన్నది చూడాలి.
- Advertisement -