Thursday, September 19, 2024

ఓటమి శాశ్వతం కాదు.. గెలుపుకు నాంది

- Advertisement -
Defeat is not permanent.. it is the beginning of victory

భువనగిరి
భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గోన్నారు.హరీష్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ సమావేశానికి భారీ సంఖ్యలో వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కృతజ్ఞతలు. ఒడిపోయిన నియోజకవర్గంలో సభ లో పట్టనంతమంది రావడం మన బలానికి చిహ్నం.  ఓటమి శాశ్వతం కాదు. గెలుపుకు నాంది. ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే.  ఎన్నికల హామీలను నిలబెట్టుకోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
ప్రచారంలో అబద్ధాలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చాక అసహనం పెరిగింది.  రైతుబంధు పడడం లేదని జడ్పీ చైర్మన్గా బాధ్యతతో సందీప్ రెడ్డి అడిగితే ఆయనను పోలీసులతో బయటికి పంపించారు.  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నల్గొండపై ప్రేమ ఉంటే సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడాలి. రైతు బంధు పడడం లేదని ప్రశ్నిస్తే చెప్పుతో కొట్టాలనడం ఏం సంస్కారం?  శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు కేఆర్ఎంబీకి అప్పగించడం వల్ల నల్గొండకు తీవ్ర నష్టం జరుగుతుంది. సాగునీళ్లు, తాగునీళ్లు ఉండవు.   కాంగ్రెస్ ఎన్నికల్లో మన గురించి పచ్చి అబద్ధాలు చెప్పింది. బీఆర్ఎస్, బీజేపీల మధ్య సంబంధం ఉందని దుష్ప్రచారం చేసింది. బండి సంజయ్, రఘనందన్ రావు, ఈటల రాజేందర్ల ను ఓడించింది కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్సే. ఎన్నికల హామీలను తప్పించుకోవడానికి అసలు అప్పును రెట్టింపు చేసి గొబెల్స్ ప్రచారం చేస్తున్నారని అన్నారు.
నర్సింగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ అపాయింట్మెంట్ మాత్రమే ఇచ్చింది.  మరి ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎందుకివ్వలేదో జవాబు చెప్పాలి.  అధికారంలోకి వచ్చే వెంటనే 2 లక్షల రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదు?  వృద్ధులకు, వికలాంగులకు ఫించన్ 4 వేలకు పెంచలేదు. 2వేల ఫింఛన్ను కూడా సమయానికి ఇవ్వడం లేదు.  రైతుబంధు, పింఛన్, రుణమాఫీ, కరెంట్, ఉద్యోగాలు, వడ్లకు బోనస్.. అన్ని హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలి. కాంగ్రెస్ 420 హామీలపై గ్రామాల్లో, తండాల్లో చర్చకు పెట్టండి.  దళిత బంధుకు మంజూరైన నిధులను ఆ కాంగ్రెస్ బ్యాంకుల్లో ఫ్రీజ్ చేసింది.  కార్యకర్తలందరూ కష్టపడండి.. ఎంపీ సీటు మనదే. స్థానిక ఎన్నికల్లో కష్టపడి పోరాడి సత్తా చూపిద్దాం.  తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీనే. కాంగ్రెస్, బీజేపీలు వాటి స్వార్థం కోసమే పనిచేస్తాయి. బీఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాల కోసమే పోరాడుతుంది.  కర్నాటక కాంగ్రెస్ను ప్రజలు తిరస్కరిస్తున్నారు. అక్కడి 25 ఎంపీ సీట్లలో నాలుగైదు మాత్రమే వస్తాయంటున్నారు.  ఇక్కడ కూడా హామీలను విస్మరించిన కాంగ్రెస్కు అదే గతి పడుతుంది.  మనం భయపడాల్సిన అవసరం లేదు, భవిష్యత్తు మనదే.  మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం కోసం పనిచేశాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల కోసమే కొట్లాడదాం.  అధికారపక్షమైనా, ప్రతిపక్షమైనా మనం ప్రజల పక్షమని అన్నారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్