- Advertisement -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు విద్యార్థులు మృతి
Fatal road accident.. Five students died
కాంకేర్
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం కంకేర్ జిల్లా భానుప్రతాపూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్దులు మృతి చెందారు. అంతాఘర్ నుంచి భానుప్రతాప్పూర్ కు వస్తున్న స్కార్పియో వాహనం ఎదురుగా వస్తున్న రెందు బైకులను ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు బాలికలు మరణించారు. ఘటనలో కంతీ కవాడే, ప్రియంకా నిషాద్, సెవన్ కుమార్, చోకేశ్వర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో మరణించాడు. స్కార్పియో డ్రైవర్ మద్యం మత్తులో వున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
- Advertisement -