రామగుండంలో ఉచితంగా ఎర్రచందనం మొక్కల పంపిణీ
స్థానిక రామగుండం కార్పోరేషన్ , ఒకటవ డివిజన్ , విలేజ్ రామగుండం లో కేపీఎన్ ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధి గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర ఆధ్వర్యంలో గ్రామస్తులకు ఉచితంగా బంగారు కలపగా పేరు గాంచిన ఎర్రచందనం మొక్కలను బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు 150 కుటుంబాలకు ఇంటికి రెండు మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర మాట్లాడుతూ ” కేపీఎన్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ద్వారా మిత్రులు లాటుకూరి క్రాంతి కుమార్, చెన్నూరి నాగరాజుల సహకారంతో నిరుపేద, మధ్యతరగతి కుటుంబలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ ఎర్రచందనం మొక్కల పంపిణీ కార్యక్రమం తీసుకోవడం జరిగిందని, రామగుండం నియోజకవర్గంలో మొత్తం 50,000 కుటుంబాలకు, మొదటి విడతలో 10,000 కుటుంబాలకు ఉచితంగా ఇంటికి రెండు ఎర్రచందనం మొక్కలను ఇచ్చి, వారికి బయ్ బ్యాక్ అగ్రిమెంట్ ఒక్కో మొక్కకు రూపాయలు 4,50,000/- అనగా రెండు మొక్కలకు మొత్తం తొమ్మిది లక్షల రూపాయలు అగ్రిమెంట్ ఇస్తున్నామని, ప్రజలు మొక్కలను ఉచితంగా తీసుకొని మంచిగా చూసుకోని , మొక్కలను కాపాడాలని, వచ్చే డబ్బులు పిల్లల ఉన్నత చదువులకు, అమ్మాయి వివాహానికి, లేదా వృద్ద వయసు వచ్చే సరికి ఈ డబ్బులు ఎంతగానో ఉపయోగ పడతాయని” అన్నారు. అనంతరం మొక్కల సంరక్షకులు ముక్కు నర్సయ్యను నాయకులు బద్రి రాజు షాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బద్రిరాజు, గ్రామస్తులు మంథని నరేష్, మహ్మద్ అబ్దుల్ ఖలీల్, మామిడి భీమయ్య, అనురాధ, స్రవంతి, స్వప్న లతో పాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇట్లు
గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర
కేపీఎన్ ఎంటర్‌ప్రైజెస్