- Advertisement -
గాంధీ ఆలోచన, మోదీ సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవాలి
Gandhi's thought and Modi's determination should be carried forward
సికింద్రాబాద్
గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్, ఎంజీ రోడ్డు మహాత్మ గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూలమాలవేసి నివాళులార్పించారుజ తరువాత స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ పారడైజ్ కలాసిగూడ పార్క్ లైన్ రోడ్ లోని వీధులన్నీ ఊడ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని పదేళ్ల క్రితం మోది ప్రభుత్వం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టింది. మన పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. స్వచ్ఛత విషయంలో పరిశుభ్రత విషయంలో ప్రభుత్వాలె కాదు ప్రజల సహకారం, భాగస్వామ్యం కూడా అవసరం వుంది. భారత్ అతిపెద్ద దేశం కోట్ల మంది ప్రజలు దేశంలో నివసిస్తున్నారు పరిశుభ్రత స్వచ్ఛత లేకపోతే దేశం, ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఐఏఎస్ నుంచి ఐపీఎస్ వరకు స్కూల్ తరగతి గది నుంచి పట్టణాల వరకు ఈ స్వచ్ఛత కార్యక్రమం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతున్నారు ఇది చాలా మంచి పరిణామం. స్వాతంత్ర ఉద్యమం సమయంలో గాంధీ గారు స్వాతంత్రం కావాలా… స్వచ్ఛత కావాలా అని .. అడిగితే.. స్వచ్ఛత ముందు కావాలి.. స్వతంత్రం ఎలాగైనా వస్తుందని చెప్పారు.
ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ లో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని అన్ని వర్గాలు ప్రజలకు పిలుపునిచ్చారు. మన పరిసరాలను మన ప్రాంతాల్ని శుభ్రం ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే. మన దేశంలో ఆరోగ్యవంతమైన ప్రజలు ఆరోగ్యవంతమైన దేశంగా చూడాలనే లక్ష్యంతో మోదీ ఈ కార్యక్రమాన్ని తీసుకోచ్చారు. స్వచ్ఛభారత్ అంటే ప్రభుత్వ కార్యక్రమం కాదు ఇదో ప్రజా ఉద్యమంగా చూడాలి. జాతిపిత గాంధీ ఆలోచన.. మోది సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నానని అన్నారు
- Advertisement -