- Advertisement -
మధ్య తరగతికి వరాలు జల్లు..12 లక్షల వరకూ నో ఇన్‌కంట్యాక్స్ !
Gifts for the middle class..No income tax up to 12 lakhs!
న్యూడిల్లీ
:-కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తమ పాలనా కాలంలో మధ్య తరగతికి అతి పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. ఏకంగా పన్నెండు లక్షల రూపాయల వరకూ ఆదాయపు పన్ను మినహాయిస్తూ బడ్జెట్‌లో నిర్ణయం తీసుకుంది. కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకునేవారికి ఇది వర్తిస్తుంది. ఇప్పటి వరకూ ఏడున్నర లక్షల వరకూ మినహాయింపు ఉఉంది. ఇప్పుడు ఏకంగా పన్నెండు లక్షల రూపాయలకు చేయడంతో మధ్యతరగతికి పెద్దఎత్తున లబ్ది చేకూరనుంది.ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నెలకు రూ. లక్ష సంపాదించేవారూ ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకూ ఏడాదికి ఏడెనిమిది లక్షలు అంటే నెలకు అరవై వేలు సంపాదించే వారూ ఎన్ని సేవింగ్స్ చేసినా మూడు, నాలుగు వేలు నెలకు పన్నులుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక పాత ఆదాయపు పన్ను విధానం కూడా కొనసాగుతుంది. ఇందులో కూడా కాస్త రిలీఫ్ ఇచ్చారు.నాలుగు లక్షల రూపాయల సంపాదన వరకూ సున్నాం.. ఆ తర్వాత ఎనిమిది లక్షల వరకూ ఐదు.. ఆ తర్వాత పన్నెండు లక్షల వరకూ పది శాతం పన్ను ఉంటుంది. పదహారు లక్షల రూపాయల వరకూ పదిహేను శాతం.. ఇరవై లక్షల రూపాయల వరకు ఇరవై ఐదు శాతం పన్ను విధించారు. పాతిక లక్షలు ఆదాయం దాటిన వారిపై ముఫ్పై శాతం పన్ను విధిస్తారు.కొత్త విధానంలో ఎలాంటి సేవింగ్స్ చేయకుండానే పన్నెండు లక్షల వరకూ మినహాయింపు ఉంటుంది. ఆ తర్వాత శ్లాబుల ప్రకారం ఇరవై శాతం వరకూ పన్ను పడుతుంది. కొత్త పన్ను విధానానికి అందర్నీ మార్చే ప్రయత్నంలోనే ఈ భారీ మినహాయింపు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. మొత్తంగా ఈ సారి మాత్రం ఈ బడ్జెట్ మధ్యతరగతికి చాలా మందికి మేలు చేసేదే.
- Advertisement -