- Advertisement -
ప్రారంభమైందా… ముగిసిందా…
Has it started... has it finished...
విజయవాడ, జనవరి 22, (వాయిస్ టుడే)
ఏపీలో ఇటీవల మంత్రి నారా లోకేష్ పేరు మార్మోగింది. లోకేష్ కు డిప్యూటీ సీఎం పోస్టు ఇవ్వాల్సిందేనని పలువురు టీడీపీ అగ్ర నేతల నుండి నాయకుల వరకు తమ వాణి వినిపించారు. ముందు మహాసేన రాజేష్, ఆ తర్వాత కడప టీడీపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ భరత్, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, ఇలా ఒకరి తర్వాత ఒకరు లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని గళమెత్తారు. అంతేకాదు సోషల్ మీడియాలో టీడీపీ వర్సెస్ జనసేన కామెంట్స్ మార్మోగిందిలోకేష్ కు డిప్యూటీ సీఎం, పవన్ కు సీఎం పోస్టు ఖరారైందని పలువురు జనసేన నాయకులు పోస్టులు కూడ పెట్టారు. ఈ దశలోనే తిరుపతికి చెందిన జనసేన లీడర్ కిరణ్ రాయల్ నేరుగా సీఎం పదవి పవన్ కు ఇవ్వాలని కరాఖండిగా చెప్పారు. పలు డిబేట్ లలో కూడ ఇదే వాణి వినిపించారు కిరణ్. ఇలా టీడీపీలో కొందరు, జనసేనలో కొందరు అదేపనిగా విమర్శల జోరు సాగించారు. ఇలాంటి పరిస్థితిని ఇప్పుడే సద్దుమణిగించకుంటే, భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని భావించారో ఏమో కానీ, టీడీపీ అధినాయకత్వం దీనిపై స్పందించింది. లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే ఊహాగానాలు అబద్దమని, ఎవరైనా ఈ విషయంపై మాట్లాడితే చర్యలు తప్పవంటూ క్యాడర్ కు హెచ్చరించింది.టీడీపీ ఇలా ప్రకటన ఇచ్చిన మరుసటి రోజు జనసేన కూడ ఇదే తరహా హెచ్చరికలు జారీ చేసింది. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ స్పందించవద్దని, ఈ అంశంపై మీడియా ముందు గానీ, సోషల్ మీడియాలో గానీ స్పందించవద్దంటూ జనసేన కేంద్ర కార్యాలయం ప్రకటన ఇచ్చింది. మొత్తం మీద అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీలు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉందని పొలిటికల్ టాక్. మొదట ఈ టాక్ వినిపించినప్పుడే సద్దుమనిగించి ఉంటే నేడు ఇలాంటి పరిస్థితి ఉండదని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. ఇక టీడీపీకి కౌంటర్ గా జనసేన సీఎం నినాదం తెరపైకి తెస్తో్ంది. లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని తెలుగు తుమ్ముళ్లు డిమాండ్ చేస్తుంటే.. పవన్‌కళ్యాణ్‌ను సీఎంగా చూడాలనే కోరిక ఉన్నట్లు జనసేనికులు ప్రకటనలు చేస్తున్నారు.. సమయం సందర్భంగా లేకుండా మొదలైన ఈ రచ్చ ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. టీడీపీలో కీలక పదవుల్లో ఉన్న నేతలు, ఎమ్మెల్యే, మాజీలు లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేస్తూ కూటమిలో కొత్త చర్చకు తెరలేపుతున్నారు. మాజీ మంత్రి, నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి లాంటి నేతలు కూడా అదే డిమండ్ చేస్తుండటం విచిత్రంగా తయారైంది.మంత్రి పదవిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇవే తన చివరి ఎన్నికలంటున్న ఆయన మంత్రిగానే పొలిటికల్ రిటైర్‌మెంట్ తీసుకుంటానని భావించారంట. అయితే పార్టీ భవిష్యత్తు అవసరాల కోసం చంద్రబాబు కొత్తవారికి, యువతకు మంత్రివర్గంలో పెద్దపీట వేసి పార్టీలోని సీనియర్లను పక్కన పెట్టేశారు. ఆ ఫ్రస్టేషన్‌లోఉన్న ఎలాగైనా పార్టీ అధిష్టానం దగ్గర మంచి మార్కులు కొట్టేసి.. ఏదో ఒక పదవి దక్కించుకోవడానికే ఇలాంటి పోస్టులు పెడుతున్నారంట. కడప జిల్లాలో ఎన్టీఆర్ వర్ధంతి సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఆ డిమాండ్ వినిపించి చర్చకు తెరలేపారు.కడపలో వైసీపీ కంచుకోటను బద్దలు గొట్టి శ్రీనివాసరెడ్డి సతీమణి మాధవీరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమెకు మంత్రి పదవి వస్తుందని వారి వర్గం చాలా ఆశలు పెట్టుకుంది. అయితే ఆమెకు ఆ ఛాన్స్ దక్కలేదు. రాష్ట్రంలో ఒక మంత్రి పదవి ఖాళీగా ఉండటం, దాని భర్తీ సందర్భంగా కొందరు మంత్రులను మారుస్తారన్న ప్రచరం జరుగుతుంది. ఎలాగూ కొత్త వారికే టీడీపీ పెద్దపీట వేస్తుంది కాబట్టి, మొదటి సారి గెలిచిన మాధవిరెడ్డికి కేబినెట్ బెర్త్ దక్కుతుందన్న ఆశతో శ్రీనివాసరెడ్డి సరికొత్త డిమాండ్‌తో లోకేష్ దృష్టిలో పడే ప్రయత్నం చేశారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. శ్రీనివాసరెడ్డి వాయిస్ వినిపించిన మరుసటి రోజే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని ప్రతిపాదించారు. లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ శ్రేణులు…డిమాండ్ చేయడంలో తప్పేముందని వర్మ ప్రశ్నించారు.ఎవరి లెక్కలు ఎలా ఉన్నా పిఠాపురంలో పవన్‌కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన వర్మ ఎమ్మెల్సీ పదవిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే మొదటి టర్మ్‌లో ఆయనకు అవకాశం దక్కలేదు. వైసీపీ నుంచి వచ్చిన సీ. రామచంద్రయ్య వంటి వారికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన చంద్రబాబు.. ఎందుకనో వర్మకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆ క్రమంలో చట్ట సభలో అడుగుపెట్టాలని తహతహలాడుతున్న వర్మ .. తాను లైన్‌లో ఉన్నానని లోకేష్‌కు గుర్తు చేయడానికే డిప్యూటీ సీఎం మంత్రం పఠిస్తున్నారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.ఆ డిమాండ్‌పై రాజమండ్రి ఎమ్మెల్చే ఆదిరెడ్డి వాసు తనదైన స్టైల్లో స్పందించారు. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం మాత్రమే కాదు.. సీఎం అవ్వాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నాని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వ్యాఖ్యానించారు. అలానే పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా స్వాగతిస్తానని స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమిలో ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో పెద్దలు నిర్ణయిస్తారని .. వర్మ లేదా తమ పార్టీలో ఇంకెవరైనా చెప్పినా వారి వ్యక్తిగత అభిప్రాయమే అని తేల్చి చెప్పారు. ఎన్డీఏ కూటమిలో అందరూ బాగానే ఉన్నారని.. వైసీపీ పిల్ల సైకోలు చిచ్చు పెట్టాలని చూస్తున్నారని చురకలు అంటించారు.మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటున్న టీడీపీ నేతల డిమాండ్‌పై జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ స్పందించారు. నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేసుకోవాలని టీడీపీ వాళ్లకు ఉంటే.. పవన్ కల్యాణ్‌ను సీఎం చేసుకోవాలనే కోరిక మాకూ ఉంటుందన్నారు. ఎన్నికలకు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ముందుకు వెళ్లాలి… అలా వెళ్తేనే అందరికీ మంచిది అంటూ .. వైసీపీ చేతికి అనవసరంగా అస్త్రాలు అందించవద్దని సూచించారు.ఆదిరెడ్డి వాసు, కిరణ్ రాయల్ పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూ ఇచ్చిన స్టేట్‌మెంట్లపై తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క పవన్‌కళ్యాణని లోకేష్ తన అన్నలాంటి వాడని గౌరవిస్తూ, ఆయనకు పాదాభివందనం చేసి పెద్దరికాన్ని గౌరవిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు సైతం ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం చెప్పింది జరగాల్సిందే అన్నట్లు ఆయనకు వాల్యూ ఇస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీలు పాలించినప్పుడు ఒకరికి నలుగురు డిప్యూటీ సీఎంలు ఉండేవారు. అయితే కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు. రెండో డిప్యూటీ సీఎం అన్న ప్రస్తావనే కనిపించదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి మాయలోనో పడో.. లేకపోతే ఎవరి మెహర్బానీ కోసమో నేతలు ఇలాంటి తలతోక లేని డిమాండ్లు మానుకోవాలని కూటమి శ్రేణులు ఫైర్ అవుతున్నాయి.
- Advertisement -