హైదరాబాద్ నవంబర్ 3: ఆనందకర, ఆహ్లాదకరమైన ఆరోగ్య తెలంగాణ కేవలం బి ఆర్ ఎస్ కే సాధ్యమవుతుందని వాకర్స్ మద్దత్తుబీఆర్ఎస్ కే అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు.ఈరోజు ఉదయం అయన అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి ఎంసి హెచ్ ప్లేగ్రౌండ్ లో మరియు సిపిఎం లో గల వర్కర్స్ తో సమావేశం నిర్వహించారు. గత దశాబ్ది కాలం నుండి సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరిగిన సంక్షేమాభివృద్ధిని వారికి వివరించి, నవంబర్ 30 నాడు జరగబోయే ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి పెద్ద మెజారిటీ తో గెలిపించాలని ఎమ్మెల్యే కాలేరు వారిని కోరారు. అంబర్పేట నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ తమకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్న కాలేరు వెంకటేష్ కే తాము ,బీఆర్ఎస్ కే మద్దత్తు ఇస్తామని వాకర్స్ పేర్కొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, గోల్డ్ శీను గణేష్ చంద్రమౌళి అజయ్ ముదిరాజ్ తో పాటు పలువురు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.