కోర్టు తీర్పు పైనే ఆశలు!
Hopes on the court's verdict!
న్యాయం కోసం ఎదురుచూస్తున్న గురుకుల అభ్యర్థులు.
గురుకుల అభ్యర్థుల చివరి ప్రయత్నం.
గోదావరిఖని :
గత పది నెలలుగా గురుకుల అభ్యర్థులు న్యాయం చేయాలని, డౌన్ మెరిట్ అవకాశం కల్పించాలని, మిగిలిపోయిన పోస్టులను బ్యాక్ లాగ్ చేయకుండా డౌన్ మెరిట్ అవకాశం కనిపించాలని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. అయినా వారి మొర ప్రభుత్వం,అధికారులు, మంత్రులు ఎమ్మెల్యేలు
పట్టించుకున్న పాపాన పోలేదు. వారు చేసేది ఏమీ లేక కోర్టు ను ఆశ్రయించారు. చివరికి కోర్టు తీర్పు కొరకు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
నిరుద్యోగులంతా తల ఇంత డబ్బులు వేసుకొని.
గురుకుల అభ్యర్థులు కోర్టు ద్వారా న్యాయం జరుగుతుందని, ఆశతో గురుకుల అభ్యర్థులంతా మనిషికి కొంత డబ్బులు వేసుకొని కోర్టులోకేసు వేసుకున్నారు. ముఖ్యంగా కోర్టు కేసులో
డౌన్ మెరిట్,న్యాయం కోసం కొందరు నిరుద్యోగులు వారు చేసే ప్రైవేటు ఉద్యోగాలు , కుటుంబాలను సైతం వదులుకొని ప్రతిరోజు లాయర్ల చుట్టూ, కోర్టు చుట్టూ ఆశతో తిరుగుతున్నారు. ఏది ఏమైనా గురుకుల అభ్యర్థులకు కోర్టు ద్వారా లాభం జరగాలని అందరు అనుకుంటున్నారు.
గురుకుల అభ్యర్థుల విన్నపం.
గత ప్రభుత్వం గురుకులాల్లో 9210 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక
గురుకుల ఫలితాలు ప్రకటించి
ఆగమేఘాలమీద అధికారులు ముఖ్యమంత్రి మెప్పు పొందేందుకు కొందరికి ఉద్యోగాలు పత్రాలు అందజేసింది. ముఖ్యంగా గురుకుల
ఈ ఉద్యోగాల్లో డీల్,జెల్,పీజీటీ,టీజీటీ, అభ్యర్థులకు కామన్ పేపర్ ఒకటే పెట్టడం ద్వారా ఒకే అభ్యర్థి మూడు,నాలుగు ఉద్యోగాలు సాధించారు. కానీ ఒకే అభ్యర్థి ఒకే ఉద్యోగం చేస్తాడు. ఇలా అన్ని ఉద్యోగం పొందిన అభ్యర్థి నుండి( రిలీక్విష్మెంట్ ) మిగిలిన ఉద్యోగాలు వదులుకుంటున్నానని ఉద్యోగం వచ్చిన అభ్యర్థి నుండి అవకాశం కల్పించి. మిగిలిపోయిన పోస్టులకు డౌన్ మెరిట్ అవకాశం కల్పించాలని గురుకుల అభ్యర్థుల ప్రధాన డిమాండ్ ఇంతవరకు ప్రభుత్వం నుండి ఎలాంటి
అనుమతి రాకపోవడంతో
గురుకుల అభ్యర్థులంతా
చేసేది ఏమీలేక కోర్టును ఆశ్రయించారు. వారంతా కోర్టు తీర్పు కోసం ఆశతో ఎదురుచూస్తున్నారు.