Thursday, May 21, 2026

హైడ్రా అంటే నమ్మకం…

- Advertisement -

హైడ్రా అంటే నమ్మకం…

Hydra means trust...

హైదరాబాద్, జనవరి 28, (వాయిస్ టుడే)
హైదరాబాద్‌ డిజాస్టర్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్ అండ్‌ ప్రొటెక్షన్‌’ ను ప్రజలు విశ్వసించారు. ఎందుకో తెలియదు కానీ.. దానికి ఫిర్యాదు చేస్తే తమ సమస్యకు వెంటనే పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు. అందుకే హైడ్రా అధికారులు నిర్వహించే ప్రజావాణికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ప్రతి సోమవారం ప్రజల నుంచి వినతులను స్వీకరించాలని హైడ్రా కమిషనర్ రంగనాధ్ నిర్ణయించిన తర్వాత హైదరాబాద్ పరిధిలో ఉన్న అనేక ఆక్రమణల గురించి సమస్యలు ఎక్కువగా హైడ్రా అధికారులకు అందుతున్నాయి. ప్రతి సోమవారం క్రమం తప్పకుండా ప్రజావాణి నిర్వహిస్తుండటంతో ప్రజలు కూడా వారిని నమ్మి అక్కడకు వచ్చి వినతులను సమర్పిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ నగర పరిధిలో అనేక ఆక్రమణలు చోటు చేసుకున్నాయి. పోలీసులకు, రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించకున్నా లాభంలేదు. వ్యక్తిగతంగా తమ భూములను ఆక్రమించారని కొందరు, నాలాలను, చెరువులను ఆక్రమించి నిర్మాణాలను చేపడుతున్నారని ఇలా అనేక రకాలుగా అక్రమాలు సాగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. ఈ సమయంలో హైడ్రా రావడం, అది వేగంగా వెళ్లి బుల్ డోజర్ తో కూల్చివేతలను ప్రారంభిచండంతో ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది. మిగిలిన శాఖల అధికారులు చుట్టూ తిరిగే కంటే హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆక్రమణలను తొలగిస్తారన్న నమ్మకం ఏర్పడింది. అందుకే ప్రతి సోమవారం జరిగే హైడ్రా ప్రజా వాణి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి తమ ఫిర్యాదులు అందచేస్తున్నారు. ఇప్పటి వరకూ వందలసంఖ్యలో ఫిర్యాదులు హైడ్రా అధికారులకు అందాయి. మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులపై కూడా కొన్ని ఫిర్యాదులు అందాయి. అయితే అందులో నిజానిజాలను పరిశీలించిన తర్వాత న్యాయపరమైన చిక్కులు ఏవీ లేకపోతే వెంటనే హైడ్రా అధికారులు రంగంలోకి దిగి కూల్చివేతలను ప్రారంభిస్తున్నారు. ప్రధానంగా నాలాలను, చెరువులను హైదరాబాద్ నగరంలో ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో వ్యక్తిగత సమస్యలు కూడా ఎక్కువగానే వస్తున్నట్లు హైడ్రా అధికారులు చెబుతున్నారు.  కూడా హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. ఉదయం పదిన్నర గంటలకు ఫిర్యాదులను నేరుగా ప్రజల నుంచి స్వీకరిస్తారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్