జాతీయ జండాకు అవమానం
రౌడీ షీటర్ మృతదేహానికి జాతీయ జండా చుట్టి నివాళులు అర్పించిన బస్తి వాసులు.
హైదరాబాద్: పాతబస్తీ, చాంద్రాయణగుట్టకు చెందిన ఓ రౌడీ షీటర్ సయీద్ బావజీర్ ని బండ్ల గూడలోని రాయల్ సి హొటల్ దగ్గర గురువారం రాత్రి 12గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి శవ పరిక్షకు పంపారు. బస్తీవాసులు, అక్కడి ప్రజలు నివాళులు అర్పించుటకొరకు ఒక అద్దాల డబ్బాలో మృతదేహానికి జాతీయ జండాను చుట్టి పెట్టారు. ఇది పలు విమర్శలకు దారి తీసింది. జాతీయ జండాను ఇలా ఎవరు పడితే వారు మృతదేహాలకు వాడకూడదు. పతాకాన్ని ఇలా అవమానపరుచడం చట్టరీత్య నేరం. జాతీయ పతాకం గౌరవానికి అవమానాల నిరోధక చట్టం, 1971 ప్రకారం, జెండాను “రాష్ట్ర అంత్యక్రియలు లేదా సాయుధ బలగాలు లేదా ఇతర పారా-మిలటరీ దళాల అంత్యక్రియల్లో తప్ప మరే రూపంలోనైనా డ్రేపరీగా” ఉపయోగించరాదు.