జీవన్ రెడ్డికి కేబినేట్ లో  చోటు….?.

- Advertisement -

జీవన్ రెడ్డికి కేబినేట్ లో  చోటు….?.

ఎమ్మెల్సీ కోటాలో ఛాన్స్…

జగిత్యాల
:కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ , కాంగ్రెస్ సీనియర్ నాయకులు తాటిపర్తి జీవన్ రెడ్డికి కొత్తగా తెలంగాణలో ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో కేబినెట్ లో చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
జగిత్యాల నుండి ఎమ్మెల్యే గా పోటీచేసి పరాజయం పొందినప్పటికి ఎమ్మెల్సీ 2025 వరకు పదవీకాలం ఉండడంతో పాటు ప్రతి అంశంలోను పట్టు కలిగి ఉండడం,
రాజకీయ అనుభవం,పార్టీకి ప్రతికూల  పరిస్థితుల్లోనూ , బి ఆర్ ఎస్ ప్రభంజనం విచినా తట్టుకుని
2014 లో జగిత్యాల ఎమ్మెల్యే గా ఎన్నికై ఉత్తర తెలంగాణ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠతకు పాటుపడ్డారు. గతంలో కేసీఆర్ పై రెండుసార్లు కరీంనగర్  ఎంపీగా  కాంగ్రెసు అధిష్టానం ధీటైన అభ్యర్థిగా జీవన్ రెడ్డిని పోటీలో ధీoపింది.
రెండు సార్లు మంత్రిగా, ఆరు సార్లు ఎమ్మెల్యే గా, ప్రస్తుతం ఎమ్మెల్సీ గా కొనసాగుతున్న జీవన్ రెడ్డి అవసరాన్ని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించి మంచి పోర్టుఫోలియో కట్టబెడుతారనే ప్రచారం జరుగుతోంది.
ధర్మపురి , చొప్పదండి, వేములవాడ ఎమ్మెల్యేలుగా గెలుపొందదానికి జీవన్ రెడ్డి కృషి మారువలేనిదని కార్యకర్తలు, నాయకులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో జీవన్ రెడ్డి సరైన నాయకుదన్న పేరుంది.
వీటన్నిటితో పాటు ,రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాల్లో పార్టీని ,అభ్యర్థుల గెలుపుకోసం పాటుపడే సమర్థ నాయకుడని భావించి, ఓటమి చెందినప్పటికి ఎమ్మెల్సీ కోటలో  జీవన్ రెడ్డికి మంత్రి పదవిలోకి తీసుకుంటారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చజోరుగా సాగుతోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular