లోక్ అదాలత్ ను సద్వినియోగము చేసుకోవాలి

- Advertisement -

డిస్ట్రిక్ట్ సేషన్ న్యాయమూర్తి డి. రాజేష్ బాబు

నాగర్ కర్నూల్:  జాతీయ లోక్ అదాలత్ పథకాన్ని సద్వినియోగము చేసుకోవాలని చైర్మన్ / ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ సేషన్ న్యాయమూర్తి డి. రాజేష్ బాబు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన న్యాయస్థానం కోర్టు హల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా న్యాయమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ఈ నెల 30 న జిల్లా కోర్టు లో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. వివిద కేసులు ఉన్న వ్యక్తులు రాజీ మార్గంగా పరిష్కరించుకోవాలని సూచించారు. సమయం వృదాకాకుండ ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ న్యాయ చట్టంను అందరు గౌరవించాలన్నారు. నియమ, నిబంధనలు పాటించాలని వివరించారు. అధికారుల సమన్వయంతో ప్రజలకు సేవలందలని చెప్పారు. జిల్లాలో 6549 సివిల్ కేసులు ఉన్నాయని తెలిపారు. అదే విధంగా 7554 క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పారు. 193 నాన్ బెయిల్ బుల్ కేసులు ఉన్నాయని వీరందరు వెంటనే పరిష్కారం చేసుకోవాలని 114 ఐపీఎస్, 27 ఎక్సైజ్ కేసులు 48 చెక్ బౌన్స్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. కేసులుంటే ఉద్యోగంకు ఆటంకంగా మారుతుందని జాతీయ లోక్ అదాలత్ కార్యాక్రమం ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పారు. జిల్లా, హైకోర్టు, సుప్రీం కోర్టుల వరకు వెళ్లడం సమయంతో పాటు డబ్బులు కూడా కోల్పోవలసి ఉంటుందని చెప్పారు.

ఇదే కార్యక్రమంలో సెక్రెటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయమూర్తిని  జి. సబితా మాట్లాడుతూ వివిద సందర్బాలలో కేసులు నమోదయిన వాళ్ళు వెంటనే రాజీపడి  జాతీయ లోక్ అదాలత్ లో కేసులు లేకుండా చూడాలని వివరించారు. పెండింగ్ కేసులు లేకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి పి. మౌనిక, ఎపీఆర్ఓ కొట్ల. తిరుపతయ్య అడిషనల్ ఎస్పీ రామేశ్వర్, డీఎస్పీలు మోహన్ కుమార్, కృష్ణ కుమార్, పార్థ సారథి,  ఆంధ్రజ్యోతి స్టాప్ రిపోర్టర్ మహమ్మద్ అబ్దుల్లా ఖాన్,  ఎస్, ఎస్ బాబు, పరమేష్, టి న్యూస్ జర్నలిస్టు శేఖారా చారీ, 99 టివి ప్రదీప్, ప్రజా వాణీ టివి సైదులు, బి9 నాగరాజు జూనియర్ అసిస్టెంట్ కేశవరెడ్డి, 19 టివి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular