Sunday, September 8, 2024

 కేబినెట్‌లోకి మైనంపల్లి…?

- Advertisement -

 కేబినెట్‌లోకి మైనంపల్లి…?
మెదక్, మే 29, (వాయిస్ టుడే)
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల సంగ్రామం ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లోక్‌సభ ఎన్నికల్లోనూ రిపీట్‌ చేయాలని, తెలంగాణలొ మెజారిటీ ఎంపీ స్థానాలను ‘చే’జిక్కించుకోవాలని టీపీసీసీ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నీ తానై వ్యవహించారు. 15 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌ ఎంపీ స్థానంలో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ఏకంగా ఏడు సభలు నిర్వహించారు.ఎన్నికల సంగ్రామం ముగిసింది. జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఫలితాలతో సంబంధం లేకుండా సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై దృష్టిపెట్టారు. ఇటీవలే కేబినెట్‌ మీటింగ్‌ నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీకి కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.పూర్తిస్థాయి పాలనను అందించేందుకు తెలంగాణలో ఖాళీగా ఉన్న కేబినెట్‌ స్థానాలు భర్తీ చేయాలని సీఎం నిర్ణయించారు. మొత్తం 17 స్థానాలకు 11 స్థానాలే భర్తీ చేశారు. ఇంకా ఆరు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత కేబినెట్‌ విస్తరణతోపాటు నామినేటెడ్‌ పదవులు, ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయాలని రేవంత్‌ భావిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు, నేతల పనితీర, పార్టీ విధేయులకు ఇటు మంత్రిర్గంలో అటు పార్టీలో, నామినేటెడ్‌ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు.పూర్తిగా పాలనపై దృష్టి సారించేందుకు సీఎం రేవంత్‌ పీసీసీ పదవి నుంచి కూడా తప్పుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు అధిష్టానానికి సమాచారం ఇచ్చారు. తన వారసులుగా ఎవరిని నియమించాలో కూడా ప్రతిపాదించారు. ఎన్నికల ఫలితాల ఆధారంగా రేవంత్‌ ప్రతిపాదన ఆమోదం పొందే అవకాశం ఉందిఇక తెలంగాణ కేబినెట్‌లోకి యువ నేతలు తీసుకోవాలని కూడా కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది. ఈమేరకు సీఎం రేవంత్‌కు సూచనప్రాయంగా సమాచారం అందించింది. యువతకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలియజేసేందుకు ఇప్పటికే బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఇక కేబినెట్‌లోకి కూడా ఓ యువ ఎమ్మెల్యేను తీసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో అతి చిన్న వయస్కుడైన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ పేరు తెరపైకి వచ్చింది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు అనూహ్యంగా తనతోపాటు, తన కొడుకు రోహిత్‌కు టికెట్‌ తెచ్చుకున్నారు. ఎన్నికల్లో హన్మంతరావు ఓడిపోగా, రోహిత్‌ విజయం సాధించారు. ఇప్పుడు కేబినెట్‌లోకి యువ నేతను తీసుకోవాలని అధిష్టానం భావించిన నేపథ్యంలో తన కొడుకుకు మంత్రి పదవి దక్కేలా ఢిల్లీలో చక్రం తిప్పారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే రోహిత్‌ మంత్రి కావడం ఖాయం. అదే జరిగితే రోహిత్‌ రొట్టెముక్క తేనెలో పడినట్లే

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్