ఎఫ్బీలో మహిళతో పరిచయం
8 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు
సంగారెడ్డి
ఫేస్ బుక్ లో పరిచయమైన మహిళను నమ్మి ఓ ఉద్యోగి రూ. లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్న ఘటన అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసు కుంది. పోలీసుల కథనం ప్రకారం.. అమీన్పూర్ పరిధిలోని బీరంగూడకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫేస్ బుక్ లో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. మహిళ తాను లండన్ నుంచి హైదరాబాద్క ఓ ప్రాజెక్ట్ పని పై వస్తున్నానని అతడిని నమ్మించింది. కొంత నగదు అవసరం ఉందని, హైదరాబాద్ కు వచ్చాక తిరిగి నగదు ఇచ్చేస్తానని చెప్పింది. ఈ క్రమం లో బాధితుడు పలు దఫాలుగా రూ.8 లక్షల 57 వేల నగదును మహిళకు పంపించాడు. హైదరాబాదు వస్తానని చెప్పిన ఆమె రాకపోవగా, మెసేజ్ లకు స్పం దించలేదు. ఉద్యోగి తాను మోసపోయినట్లు గుర్తించి, ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఎఫ్బీలో మహిళతో పరిచయం 8 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు
- Advertisement -
- Advertisement -