- Advertisement -
జాతీయ రోడ్డు భత్రతా మాసోత్సవాలు పాల్గోన్న మంత్రి పొన్నం
National Road Safety Months Participated by Minister Ponnam
హైదరాబాద్
ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిధిగా హజరయ్యారు. పాఠశాల విద్యార్థులతో కలిసి రోడ్డు భద్రతా పై ఫ్లకార్డు లతో రోడ్డు భద్రతా అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. రహదారి భద్రతా పోస్టర్ , పాంపులేట్ ఆవిష్కరించారు. రవాణా శాఖ కార్యాలయం ప్రాంగణంలో ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్,హైదారాబాద్ కలెక్టర్ అనుదీప్ దురషెట్టి, విశ్వ ప్రసాద్ అడిషనల్ సీపీ ట్రాఫిక్, రవాణా శాఖ అధికారులు పాల్గోన్నారు.
మంత్రి పొన్నం మాట్లాడుతూ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు ఈరొజు ప్రారంభం అయింది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు . రోడ్డు భద్రతా మాసోత్సవాలు అందరూ రోడ్డు బద్రత పై అవగాహన కల్పించాలి , ప్రమాదాలు నివారించాలని ఈ కార్యక్రమం తీసుకున్నాం. తెలంగాణ లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ రవాణా శాఖ,పోలీస్ శాఖ ,విద్యా శాఖ అన్ని రకాల డిపార్ట్మెంట్ లు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని రవాణా శాఖ పక్షాన కోరడం జరిగిందని అన్నారు.
రోడ్డు భద్రత పై ఎవరికి వారు అవగాహన చేసుకొని అమలు చేస్కోవాలి. ప్రజలు చైతన్యం కావాలి సామాజికంగా ముందుకు పోవాలి. ప్రతి పాఠశాల లో యునిసెఫ్ సహకారంతో ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ సంవత్సరం 500 ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ఈ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ లు ఏర్పాటు చేస్తం. చిన్న తనం నుండి ట్రాఫిక్ పై అవగాహన కల్పించాలి.7 వ తేది జాతీయ రవాణా రోడ్డు శాఖ మంత్రి గడ్కారీ చేత జాతీయ రవాణా సమావేశం జరుగుతుందిఅక్కడ రోడ్డు భద్రత పై చర్చిస్తాం. రోడ్డు నిబంధనలు ఉల్లగించిన వాటిపై లైసెన్స్ లు రద్దు చేస్తాం..అయిన అలాగే చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. రోడ్డు రవాణా ,ఆర్టీసీ, భవనాలు రోడ్డు ప్రమాదాలను జరిగే బ్లాక్ పాయింట్స్ ను గుర్తించి తొలగిస్తాం. హైదరాబాద్ లో ట్రాఫిక్ పై అవేర్నెస్ కల్పిస్తాం. నగరంలో అనేక జంక్షన్ లు వస్తున్నాయి. రోడ్డు భద్రత పై ప్రతి ఒక్కరూ ఒక ముగ్గరుకి అవగాహన కల్పించాలని అన్నారు.
- Advertisement -