ప్రజలు డిసెంబర్ 31 వేడుకలు శాంతి యుత వాతావరణంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలి.
People should celebrate December 31 in peaceful atmosphere without any untoward incident.
రామగుండం ప్రజలందరికీ
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
31వ తేది రాత్రి 10 గం. నుండి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తాము.*
డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసి బైయిండోవర్ చేయడం జరుగుతుంది :
పోలీస్ కమీషనర్ శ్రీనివాస్
గోదావరిఖని :
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ప్రజలు డిసెంబర్ 31 వేడుకలు ప్రజలు ప్రశాంతవంతమైన, శాంతియుత వాతావరణం ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా, ఇబ్బందులు కలగా కుండా ప్రమాదాలకు దూరంగా ఉంటూ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోనేందుకు పలు సూచనలు చేస్తూ రామగుండం పోలీస్ కమిషనర్ ప్రకటన విడుదల చేశారు.
డిసెంబర్ 31 రాత్రి నిర్వహించుకునే నూతన సంవత్సర వేడుకల సందర్బంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్థానిక పోలీసులతో పాటు ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్, క్రైమ్, షీ టీమ్స్, మఫ్టీ టీమ్స్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో ప్రమాదల నివారణకు, అక్రమ సిట్టింగులు, ఆరుబయట మద్యం సేవించడం, గుంపులు గుంపులుగా తిరుగుతూ మహిళలను వేదింపులకు గురి చేస్తూ, ఇబ్బందులను పెట్టే వారిపై ఎప్పడికప్పుడు పర్యవేక్షణతో పాటు పెట్రోలింగ్ విభాగాలకు చెందిన పోలీసులు ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తారు.
ముఖ్యంగా ఈ వేడుకలను ప్రజలు ఆర్థరాత్రి 12.30 గంటల లోపు ముగించుకోవాల్సి వుంటుందని. ఈ నూతన సంవత్సర వేడుకుల సందర్బంగా ఎర్పాటు చేసే సంస్కృతిక కార్యక్రమాలకు నిర్వహకులు తప్పని సరిగా పోలీసు అధికారుల నుండి ముందస్తూ అనుమతులు తీసుకోవడంతో పాటు, వేడుకలు నిర్వహించుకునే ప్రాంతంలో ఎలాంటి అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని, అలాగే కార్యక్రమాల నిర్వహణ ప్రదేశంలో తప్పనిసరిగా సిసి కెమెరాల ఏర్పాటు చేయడంతో పాటు సెక్యూరీటీ సిబ్బంది ఎర్పాటు చేసుకోవాల్సి వుంటుందని అన్నారు. ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహిస్తే వారిపై తగు చర్యలు తీసుకోబడుతుందని తెలిపారు
ఆర్కెస్ట్రా, డి.జే లు, మైకులు ఉపయోగించడం, బాణసంచా నిషేధం. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవు.
మద్యం దుకాణాలు, వైన్ షాప్స్, బార్స్, రెస్టారెంట్స్ ప్రభుత్వo అనుమతించిన సమయపాలన పాటించాలి.
31వ తేది రాత్రి 10 గం. నుండి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తాము ప్రధానంగా ఈ వేడుకల వేళ యువకలు మద్యం సేవించి నిర్లక్ష్యంగా మద్యం మత్తులో వేగంగా వాహనాలు నడపడం, రోడ్లుపై వెళ్ళేవారిని ఇబ్బందికి గురిచేసే వ్యవహరిస్తే అలాంటి వారిని అదుపులొకి తీసుకుని, వాహనం సీజ్ చేయడం, జరిమానా, లైసెన్స్ రద్దు చేయడం, బైయిండోవర్ లాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబడును.
ట్రిబుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండ వాహనం నడిపితే కూడా చట్ట పరమైన చర్యలు తప్పవు.
• ముఖ్యంగా యువత పై ఏదైనా కేసు నమోదు ఐతే భవిషత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర దేశాలకు వెళ్ళుటకు వీసాలు లాంటివి ఇవ్వబడవు కావున యువత గమనించగలరు. మద్యానికి దూరంగా ఉండాలి తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త, పర్యవేక్షణ ఉండాలి. అందరు బాధ్యతయుతంగా వ్యవహరించాలి.
వేడుకల్లో అపశృతులు జరగకుండా వాహన తనిఖీలు, పెట్రోలింగ్, పికేట్స్, మఫ్టీ టీమ్స్, ముఖ్యమైన కూడలిలలో సీసీ కెమరాలు ఏర్పాటు లాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నాము. ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలి.
* న్యూ ఇయర్ వేడుకలలో నిషేదిత డ్రగ్స్, గాంజా వంటి మత్తు పదార్థాలు విక్రయించిన, వినియోగించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఈ నూతన సంవత్సర వేడుకలను ప్రజలు, యువత శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, కుటుంబ సమేతంగా తమ ఇళ్లలో సంతోషంగా, చట్టబద్ధంగా నిర్వహించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు.