22.1 C
New York
Friday, May 31, 2024

ఏపీలో దత్తపుత్రుడి పాలిటిక్స్…

- Advertisement -

ఏపీలో దత్తపుత్రుడి పాలిటిక్స్…

  • కడప, మే 9

ఏపీ రాజకీయాలకు దత్తపుత్రుడు అన్న పదాన్ని పరిచయం చేసింది వైసీపీ అధ్యక్షుడు జగన్.. ఇప్పుడాయన్నే దత్తపుత్రుడంటూ టార్గెట్ చేస్తున్నారు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. తన అన్న ప్రధాని మోడీ దత్తపుత్రుడని పదేపదే ఎత్తిపొడుస్తున్నారు. కడప ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిల అటు ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు, జగన్, ప్రధాని మోడీలపై తనదైన స్టైల్లో ధ్వజమెత్తుతున్నారు. పోలింగ్ గడువు దగ్గరపడుతున్న టైంలో ఆమె ప్రసంగాల్లో వాడి వేడి పెరిగిపోతుంది. ఓటమి భయం పట్టుకుని అవినాష్‌రెడ్డి దేశం వదిలి పారిపోయే పనిలో పడ్డారని ఆమె చేసిన ఆరోపణ కలకలం రేపుతోంది.మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యని ఫోకస్ చేస్తూ వైసీపీని ఒక రేంజ్లో టార్గెట్ చేస్తున్నారు పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల వివేకా హత్యకేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డిపై పోటీ చేస్తున్న ఆమె.. అవినాష్‌తో పాటు జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ క్రమంలో ఓటమి భయంతో వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి దేశం దాటేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. దాని కోసం పాస్‌పోర్టులు కూడా సిద్ధం చేసుకున్నారన్నారు. ఓడితే అరెస్టు తప్పదనే భయంతో అవినాష్‌రెడ్డి ఉన్నారని.. ఎంపీగా ఆయన గెలిస్తే నేరం గెలిచినట్లేనన్నారు. కడపలో వైసీపీ సింగిల్‌ ప్లేయర్‌ అంటూ ఇటీవల సీఎం జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి చేసిన వ్యాఖ్యలపై షర్మిల మండిపడ్డారు.వాళ్లే అధికారంలో ఉండాలి.. వాళ్లకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లందరినీ నరికేయాలి.. వాళ్లే సింగిల్‌ ప్లేయర్‌గా ఉండాలి.. భారతి స్ట్రాటజీ ఇదేనా? గొడ్డలితో మిగతా వాళ్లనూ నరికేయండి.. అప్పుడు మీరే సింగిల్‌ ప్లేయర్‌ అని షర్మిల ఫైర్ అయ్యారు. ప్రజలకు ఎంపీ అందుబాటులో ఉండాలంటే తనకు ఓటెయ్యాలని.. మీ ఎంపీని జైలులో కలవాలంటే అవినాష్‌రెడ్డికి ఓటెయ్యండని వ్యాఖ్యానించారు.నవ సందేహాల పేరుతో జగన్‌కు వరుసగా బహిరంగలేఖలు రాస్తున్న షర్మిల .. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి పది ప్రశ్నలు సంధించారు. మన్ కీ బాత్ కార్యక్రమం రెగ్యులర్‌గా నిర్వహించే మోడీకి రేడియో గిఫ్ట్‌గా పంపారు. ఏపీ ప్రజల మన్ కీ బాత్ ఆయన వినాలని విభజన హామీలు నెరవేర్చని ఆయనకు రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదని విమర్శించారు. ఏపీ ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పదేళ్లు రాష్ట్రాన్ని మోసం చేసి ఎన్నికల కోసం మళ్లీ కపట ప్రేమ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు.జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ దత్తపుత్రుడు డైలాగ్‌ని తెగ పాపులర్ చేశారు ముఖ్యమంత్రి జగన్ .. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ అని పదేపదే విమర్శిస్తుంటారాయన. ఇప్పుడు తన అన్న జగన్‌ని దత్తపుత్రుడ్ని చేశారు షర్మిల.. ప్రధాని మోడీ దత్తపుత్రుడిగా ఉన్న జగన్‌.. ఏపీలో ఇష్టానుసారంగా పాలన చేస్తుంటే.. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయని షర్మిల ప్రశ్నించారు. లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సీబీఐ, ఈడీ జగన్ విషయంలో ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మద్యం అంటూ జగన్ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ.. నిలువునా దోచేస్తున్నారని ఘాటైన విమర్శలు గుప్పించారు.అవినాష్ దేశం విడిచి పారిపోవాలని చూస్తున్నారని .. జగన్‌ని దత్తపుత్రుడంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఏపీలో ఓట్లు అడిగే ముందు.. విభజన హామీలను నెరవేరుస్తామంటూ అఫడవిట్ రాసి.. దానిపై సంతకం చేశాకే ప్రచారం చేసుకోవాలని ప్రధాని మోడీకి ఆమె సూచించడం హాట్ టాపిక్‌గా మారింది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!