- Advertisement -
మహిళా పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభం
Recruitment process for women police jobs has started
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్
విజయనగరం
స్టైఫెండరీ మహిళా పోలీసు కానిస్టేబులు ఉద్యోగ నియామకాలకు ప్రాధమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు పి.ఎం.టి. మరియు పి.ఈ.టి. పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ శనివారం తెలిపారు.
జనవరి 4న నిర్వహించిన 5వ రోజు పి.ఎం.టి. మరియు పి.ఈ.టి. పరీక్షలకు 550 మంది మహిళా అభ్యర్ధులు హాజరుకావాల్సి ఉండగా, 323 మహిళా అభ్యర్థులు మాత్రమే పి.ఎం.టి./పి.ఈ.టి. పరీక్షలకు హాజరయ్యారన్నారు. నియామకాల ప్రక్రియ వేకువ జామున 5గంటల నుండే ప్రారంభం కావడం, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంతో, పి.ఎం.టి. మరియు పి.ఈ. టి. పరీక్షలు సకాలంలో పూర్తయ్యాయన్నారు. పోలీసు నియామకాల ప్రక్రియను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత స్వయంగా పర్యవేక్షించారు.
మహిళా అభ్యర్ధులకు చివరగా జనవరి 6న పోలీసు పరేడ్ గ్రౌండులో పి.ఎం.టి. మరియు పి.ఈ.టి. పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు. మహిళా అభ్యర్థులకు పి.ఎం.టి. మరియు పి.ఈ.టి. పరీక్షలను నిర్వహణను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా మహిళా పోలీసు సిబ్బందిని నియమించామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
ఈ నియామక ప్రక్రియలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్పీ జి. నాగేశ్వరరావు, డిఎస్పీలు యూనివర్స్, ఎం.వీరకుమార్, ఎస్.బాపూజీ, టి.ఎన్. శ్రీనివాసరావు, కే.థామస్ రెడ్డి, ఎఓ పి.శ్రీనివాసరావు, పలువురు పలువురు సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పిఈటీలు మరియు ఇతర పోలీసు అధికారులు, పోలీసు కార్యాలయ ఉద్యోగులు పాల్గొని, ఎంపిక ప్రక్రియ సజావుగా జరిగే విధంగా విధులు నిర్వహించారు.
- Advertisement -