- Advertisement -
ప్రజల రక్తాన్ని తాగుతున్న వ్యక్తి రేవంత్ రెడ్డి
Revanth Reddy is a person who drinks people's blood
తుంగతుర్తి
సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ మండిపడ్డారు. తుంగతుర్తి (మం) అన్నారం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
కేసీఆర్ మహా వృక్షం. ఓటుకు నోటు కేసులో పట్టుబడి జైలుకెళ్ళిన దొంగ రేవంత్ రెడ్డి. కేసీఆర్ కంటే గొప్పగా చేస్తావని పొరపాటున నమ్మి గెలిపిస్తే ప్రజల రక్తాన్ని తాగుతున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. ఏడాది కాలంలోనే రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు సావును, దినాలు కోరుకునే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి పదవుని చూసి మేము గౌరవిస్తున్నాం. కానీ నువ్వు మాత్రం పిట్టలదొర లాగా తుపాకిని పట్టుకుని తెలంగాణ ఉద్యమకారులపై కాల్పులు చేసిన నువ్వు ఈరోజు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నావని అన్నారు.
అబద్దాలకోరు సీఎం రేవంత్ రెడ్డి. రైతులను, అన్ని వర్గాలను మోసం చేస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. ఏడాది కాలంలో సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన ఏ సభలోనైనా కేసీఆర్ ను తిట్టకుండా సభ లేదు. కేసీఆర్ పేరు మొదలుకాకుండా రేవంత్ రెడ్డి జీవితమే మొదలు కావడం లేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాన్ని ప్రాయంగా పెట్టి సాధించి పదేళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపిన వ్యక్తి కేసీఆర్. తులసి వనంలో గంజాయి మొక్క లాంటివాడు రేవంత్ రెడ్డి. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయని దుర్మార్గపు పాలన సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. నియోజకవర్గంలో గతంతో పోలిస్తే తగ్గిన వరి ధాన్యం. రేవంత్ రెడ్డిపై నమ్మకం లేక రైతులంతా దళారులకు, మిల్లర్లకు అమ్ముకుంటున్నారు. మిల్లర్లను బ్లాక్ మెయిల్ చేస్తూ గతంలో ఉన్న సీఎంఆర్ ధాన్యం, బ్యాంకు గ్యారెంటీల పేరుతో మిల్లర్లను రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. మూసీ ప్రక్షాళన దగ్గరికి సెక్యూరిటీ లేకుండా వెళ్లిన, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు దగ్గరికి వెళ్లిన ప్రజలు తన్ని తరిమికొట్టే పరిస్థితి రేవంత్ రెడ్డి కొన్నది. మూసీ ప్రక్షాళన ప్రారంభించింది కేసీఆర్. మూసీ ప్రక్షాళన కోసం రూ.16వేల కోట్లు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బడ్జెట్ కేటాయించడం జరిగిందని అన్నారు.
మూసీ ప్రక్షాళన పేరుతో మీరు చేస్తున్న అవినీతి, దోపిడిని వ్యతిరేకిస్తున్నాం…. మూసీ ప్రక్షాళన కాదు. ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం లెక్కించే ఆదాయంలో రూ.15వేల కోట్లు వస్తే ఈ ప్రభుత్వంలో రూ.12వేల కోట్లకు ఆదాయం పడిపోయింది… ఇది ప్రభుత్వానికి చేతగానితనానికి నిదర్శనం. ప్రభుత్వాన్ని నడపడం చేతకాకపోతే దిగిపో. ఇప్పటికి 32 సార్లు ఢిల్లీకి వెళ్లి, మంత్రివర్గ విస్తరణ చేసే ధైర్యం లేని నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడుతావా. ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కుంటూ పడకుండా నిర్విరామంగా ప్రజల పక్షాన పోరాడుతాం… కొట్లాడుతాం.. నిలబడతామని అన్నారు….
- Advertisement -