‘HIT: The 3rd Case’ నుంచి రాక్ స్టార్ అనిరుద్ రవిచంద్రన్ పాడిన సింగిల్ టేక్ ఇంటెన్స్ రొమాంటిక్ సాంగ్ రిలీజ్

- Advertisement -

నేచురల్ స్టార్ నాని, శైలేష్ కొలను, వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్,

‘HIT: The 3rd Case’ నుంచి రాక్ స్టార్ అనిరుద్ రవిచంద్రన్ పాడిన సింగిల్ టేక్ ఇంటెన్స్ రొమాంటిక్ సాంగ్ రిలీజ్

Rock star Anirudh Ravichandran releases single take of intense romantic song from 'HIT: The 3rd Case'

నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ చిత్రం, టీజర్, ట్రైలర్ పాటలతో విడుదలకు ముందే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈరోజు, మేకర్స్ తను అనే స్పెషల్ సాంగ్ ని విడుదల చేశారు.
ఇది రొమాంటిక్, ఇంటెన్స్, పూర్తిగా ఒకే టేక్‌లో షూట్ చేశారు. మిక్కీ జె మేయర్ కంపోజిషన్, అనిరుధ్ రవిచందర్ వాయిస్ మెస్మరైజ్ చేశాయి. రాఘవ్ రాసిన సాహిత్యం నాని పాత్ర భావోద్వేగాలను డీప్ గా చూపిస్తుంది.
సినిమాలోని క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా ఉండే సున్నితమైన విజువల్స్ కట్టిపడేశాయి. శ్రీనిధి శెట్టి పాత్రను కలవడానికి వెళ్తున్న నానిని హ్యాపీ మూమెంట్ లో చూడటం, కేఫ్ రీయూనియన్ సన్నివేశం మనసు ఆకట్టుకుంది.
సాను జాన్ వర్గీస్ కెమెరా వర్క్ ప్రతి విజువలల్ ని మ్యాజికల్ గా ప్రజెంట్ చేసింది. ఈ చిత్రానికి కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్.
HIT: The 3rd Case మూవీ మే 1న పాన్ ఇండియాగా విడుదల కానుంది.
తారాగణం: నాని, శ్రీనిధి శెట్టి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular