- Advertisement -
రేవంత్ కు బండి సంజయ్ ఏజెంటు
Sanjay is the agent of Revanth
హైదరాబాద్
రేవంత్ కేసీఆర్ కుటుంబాల నడుమ చీకటి ఒప్పందం ఉందన్న బండి సంజయ్ వ్యాఖ్యల పై మాజీమంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ ని తిడితే కాంగ్రెస్ నేతలకు రాని కోపం బండికి ఎందుకు. రేవంత్ పై బండికి ప్రేమ పొంగుకొస్తుంది ఏంటీ మీ మధ్య సంబంధమని ప్రశ్నించారు. బండిది నిజంగా బీజేపీ రక్తమైతే రేవంత్ ప్రజా వ్యతిరేక విధానాలు పై పోరాటం చేయాలి. రేవంత్ , బండి సంజయ్ మధ్యనే అంతర్గత లావాదేవీలున్నాయని బీజేపీ నేతలే అంటున్నారు. రేవంత్ తో సంబంధాలున్నాయనే బండిని రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించారని బీజేపీ నేతలే ఆరోపించారు. వాగ్ధానాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ ని బీజేపీ ఏనాడు నిలదీయలేదు. రైతులను , మహిళలను అరాచకంగా అరెస్ట్ చేస్తుంటే బీజేపీ ఎందుకు రేవంత్ ని ప్రశ్నించడంలేదు. కేంద్రంలో కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తున్న బీజేపీ రాష్ట్రంలో ఎందుకు స్పందించడంలేదు. కాంగ్రెస్ ని వదిలి బీ ఆర్ ఎస్ , కేసీఆర్ పై బీజేపీ కి ఎందుకు విష ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ మా శత్రువంటూనే ప్రజల కోసం పోరాడుతున్న కె టీ ఆర్ ని అరెస్ట్ చేయమనడం బీజేపీ దిగజారుడుతనమే. రేవంత్ గొంతు వినిపిస్తున్న బండి సంజయే రేవంత్ కి నిజమైన ఏజెంట్. ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ , బీజేపీ రెండూ ఒక్కటే. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. రైతు భరోసా పై ప్రజా ఉద్యమం చేస్తామని చెత్త కేసులు మోపుతున్నారని అన్నారు.
- Advertisement -