29.6 C
New York
Wednesday, June 19, 2024

కాంగ్రెస్‌లో ఖమ్మం సీటుపై సస్పెన్స్‌..

- Advertisement -

తెలంగాణలో మూడు లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్‌ పార్టీలో స‍స్పెన్స్‌ కొనసాగుతోంది. హైదరాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌ స్థానాలకు అభ్యర్థుల ఫైనల్‌పై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

ఇక సీట్ల పంచాయితీ కాస్తా హైకమాండ్‌ నుంచి బెంగళూరుకు షిఫ్ట్‌ అయ్యింది. బెంగళూరు వేదికగా ఖమ్మం పాలిటిక్స్‌ నడుస్తున్నాయి.

కాగా, ఖమ్మం పార్లమెంట్‌ స్థానం కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పట్టుబడుతున్నారు. ఆయన సోదరుడు ప్రసాద్‌ రెడ్డికే సీటు కావాలని పొంగులేటి హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు.. తన భార్య నందినికి సీట్లు ఇవ్వకపోతే రాయల నాగేశ్వర రావుకు ఖమ్మం టికెట్‌ ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క​ డిమాండ్‌ చేస్తున్నట్టు సమాచారం. దీంతో, కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్‌ డీకే శివకుమార్‌ వద్దకు ఖమ్మం సీటు పంచాయితీ వెళ్లింది.

తాజాగా డీకే శివకుమార్‌.. పొంగులేటి, భట్టి విక్రమార్కను బెంగళూరుకు పిలిపించారు. ఈ సందర్భంగా ఖమ్మం సీటు విషయమై మంతనాలు జరుపుతున్నారు. దీంతో, ఈరోజు సాయంత్రంలోగా ఖమ్మం సీటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రాయలను గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా నియమించింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడం వల్ల రాయల నాగేశ్వరరావు ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన పేరును తెరపైకి తెచ్చినట్లు తెలిసింది. గతంలో రాయల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హస్తం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.

ఇదిలా ఉండగా.. ఈ నెల 25తో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. కాబట్టి ఈరోజు లేదా రేపు ఈ మూడు నియోజకవర్గాలకు హస్తం పార్టీ అభ్యర్థులను ప్రకటించవచ్చని నాయకులు భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చే నెల 11 వరకు గడువు ఉంది. పోలింగ్‌ మే 13వ తేదీన జరుగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్‌ నాలుగో తేదీన విడుదలవుతాయి.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!