నా మూట నా ఇష్టం అక్కడే పెడతా కావాలంటే రేవంత్ రెడ్డి  తో చెప్పుకో పో…

- Advertisement -

నా మూట నా ఇష్టం అక్కడే పెడతా కావాలంటే రేవంత్ రెడ్డి  తో చెప్పుకో పో…

Tell Revanth Reddy if you want to leave my bag there...

నిర్మల్
నా మూట నా ఇష్టం ఇక్కడ్నే పెడతా.. కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకో పో.అంటూ కండక్టర్ చొక్కా పట్టుకుని వార్నింగ్ ఇచ్చింది ఓ మహిళ. బస్సు కండక్టర్ తో ఓ మహిళా ప్రయాణికురాలు వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్ అవుతోంది. నిర్మల్ డిపోకు టీఎస్ 18 టీ 8485,చెందిన పల్లె వెలుగు బస్సు శుక్రవారం రాత్రి ఏడు గంటలకు  నిర్మల్ నుండి బైంసాకు బయలుదేరింది. అయితే బైంసా మండలం దేగామ్ గ్రామానికి చెందిన ఎల్క బాయి అనే మహిళ లగేజీతో బస్సులో ఎక్కింది. అడ్డంగా లగేజీ పెట్టడంతో కండక్టర్ డీఆర్ స్వామి లగేజీ దారిలో నుంచి తీసేయాలని లేదంటే బస్సు దిగిపోవాలన్నాడు. మూటలు ఇలా అడ్డం పెడితే ప్రయాణికులుఎలా ఎక్కుతారని, కండక్టర్ వాదించగా..బస్సు నాదైతే నిన్ను ఇందులో ఎక్కించు కునే వాడిని కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.  దీంతో ఆ మహిళ నా మూట నా ఇష్టం ఇక్కడ్నే పెడతా.. కావాలంటే రేవంత్ రెడ్డికి, చెప్పుకో పో అంటూ బస్సు కండక్టర్ చొక్కా పట్టుకుని మరీ వార్నింగ్ ఇచ్చింది..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular