ఈ రోజు సాయంత్రం 6 గంటలకు బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా..
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ వేగంగా ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తోంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు బీజేపీ తన తొలి విడత ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది..
రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర నేతలు లోక్‌సభ అభ్యర్థుల జాబితాపై సుదీర్ఘంగా చర్చించారు..
100 మందితో తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణతో పాటు కేరళ, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. తొలి జాబితాలోనే ప్రధాని నరేంద్రమోడీతో పాటు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ వంటి ప్రముఖుల పేర్లు కూడా ఉండే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలుపుతున్నాయి..