
తెలంగాణ రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత
మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణించాలని తెలంగాణ రాష్ట్ర
వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత అన్నారు. విబిజి ఫౌండేషన్ వనితా విభాగ్
ఫౌండర్ మడిపడిగె సత్యవతి ప్రసన్న జన్మదినం సందర్భంగా శుక్రవారం మహిళలకు
చీరలు, కుట్టు మిషన్ల పంపిణి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనాద
ఆశ్రమాల్లో నిత్యావసర వస్తువులు, వృద్దాశ్రమాల్లో బట్టలు పంపిణి చేశారు. ఈ
సందర్భంగా ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడుతూ మహిళలు ఏదో ఒక రంగంలో నైపుణ్యం పెంపొందించుకుని ఆర్ధిక పురోగతిని సాధించాలని అన్నారు. మహిళలు ఎదిగినప్పుడే కుటుంబం, సమాజం బాగుటుందని అన్నారు. ప్రతి మహిళ
విద్యను అభ్యసించాలని సూచించారు. జనాభాలో సగభాగమైన మహిళలకు
పురుషులతో సమానంగా అన్నింటిలోనూ అవకాశాలు కల్పించాల్సిన అవసరంందని
ఆమె పేర్కొన్నారు. మహిళలు పుట్టిన రోజు సందర్భంగా వేడుకల కోసం హంగు
ఆర్భాటలకు వెళ్లి డబ్బులు వృదాగా ఖర్చు పెట్టకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలను
నిర్వహించాలని ఆమె సూచించారు. సత్యవతి ప్రసన్నను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాల్లో ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో శత చిత్రాల నిర్మాత తుమ్మల పల్లి రామసత్యనారాయణ, ప్రొడ్యూసర్ డిఎస్ రావు, విబిజి
ఫౌండేషన్ ఫౌండర్ మడిపడిగ రాజు, మీరా విజయలక్ష్మి, సంతోష్, విశ్వేశ్వర్ రావు
తదితరులు పాల్గొన్నారు.