Thursday, December 26, 2024

చిరంజీవి తాతకు పుట్టినరోజు శుభాకాంక్షలు

- Advertisement -

క్యూట్ ఫోటోతో  చిరంజీవి విషెస్

హైదరాబాద్, ఆగస్టు 22: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో #HappyBirthdayChiranjeevi అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండవ్వుతోంది. ఆయన అభిమానులు చిరుకి బర్త్ డే విషెస్ చెప్పడంలో బిజీగా ఉన్నారు. తాజాగా చిరు తనయుడు రామ్ చరణ్ కూడా ఒక క్యూట్ ఫోటోతో తన తండ్రికి బర్త్ డే విషెస్ తెలిపాడు. 68వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంగా చిరు.. తన తనయుడు రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. దీంతో పాటు ఒక క్యూట్ ఫోటోను కూడా షర్ చేశాడు రామ్ చరణ్. ‘మన చిరుత (చిరంజీవి తాత)కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మా తరపు నుంచి, కొణిదెల ఫ్యామిలీ నుంచి అందులోని చిన్న వ్యక్తి నుంచి మీకు ఎంతో ప్రేమను అందిస్తున్నాం’ అంటూ చిరంజీవిని ఈ బర్త్ డే పోస్టులో ట్యాగ్ చేశాడు రామ్ చరణ్. దీంతో పాటు చిరు.. తన మనవరాలు క్లిన్ కారాను ఎత్తుకున్న ఫోటోను కూడా షేర్ చేశాడు. ఈ ఫోటోలో క్లిన్ కారా మోహం కనిపించకుండా ఫేస్‌పై ఎమోజీ పెట్టాడు.చిరంజీవి బర్త్ డే స్పెషల్ గా  Mega156 & Mega157 సినిమాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. చిరంజీవి తన కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నట్లు చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుందని టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ 156వ చిత్రాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేసారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో Mega156 మూవీ ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.”4 దశాబ్దాలుగా వెండితెరను శాసించిన లెగసీ! భావోద్వేగాలను రేకెత్తించే వ్యక్తిత్వం! ఆఫ్ స్క్రీన్ లోనూ సెలబ్రేట్ చేసుకునే వ్యక్తి.. 155 చిత్రాల తర్వాత, ఇప్పుడు #MEGA156 సినిమా ఒక మెగా రాకింగ్ ఎంటర్టైనర్ అవుతుంది” అని మేకర్స్ ట్వీట్ చేసారు. ”ప్రేక్షకులను అలరించే, తరతరాలకు స్ఫూర్తినిచ్చే ప్రయాణం.. ఆన్ స్క్రీన్ బ్రిలియెన్స్ కి, ఆఫ్ స్క్రీన్ మాగ్నానిమిటీకి నిర్వచనంగా నిలిచిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 157వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా గురించి తాజాగా అప్డేట్ బయటికొచ్చింది. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ కాన్సెప్ట్ పోస్టర్ ముందుగా విడుదలయ్యి.. అందులో మరో అప్డేట్ గురించి సమాచారం ఉంది. ఈ పోస్టర్‌ను చూస్తుంటే చిరు నెక్స్‌ట్ మూవీ సోషియో ఫ్యాంటసీ జోనర్‌కు సంబంధించిందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలావరకు ఈ అనుమానానే నిజమని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ‘బింబిసార’ అనే మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న వశిష్ట.. రెండో సినిమాకే చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు.

చిరంజీవి లెజెండ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘ఖుషీ’.. ఈ సినిమా లో విజయ్ దేవరకొండ సరసన స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను రొమాంటిక్ అండ్ లవ్ ఎంటర్టైనర్ దర్శకుడు శివ నిర్వాణ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు. ఈ సినిమా సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. దీనితో చిత్ర యూనిట్ పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ సాగిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో విజయ్ దేవరకొండ చెన్నై వెళ్లారు. ఇందులో భాగంగా ఒక ప్రెస్ మీట్ పాల్గొన్న ఆయన చిరంజీవి గురించి కూడా చెప్పుకొచ్చారు. విజయ్ మాట్లాడుతూ.. చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. అలాగే అయనంటే ఎంతో గౌరవం.ఆయన ఒక లెజెండ్..ఆయన సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర ‘వాల్తేరు వీరయ్య’ లాంటి పెద్ద బ్లాక్ బస్టర్ ను ఇచ్చారు. ఆయన ఒక ఎవరెస్టు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఆయన సాధించిన విజయాలు నాలాంటి ఎంతో మందికి స్ఫూర్తి. అలాంటి గొప్ప వ్యక్తులను విజయాలు , పరాజయాలతో మనం జడ్జ్ చేయలేము.కానీ రీసెంట్ గా ఆయన నటించిన భోళా శంకర్ ప్లాప్ కావడంతో కొంతమంది ఆయనపై చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే నాకు బాధేస్తుంది. కనీసం గౌరవం కూడా లేకుండా మాట్లాడం అస్సలు కరక్ట్ కాదు. చిరంజీవి, రజినీకాంత్ వంటి వారికీ ఇలాంటి అపజయాలు వరసగా ఆరేడు వచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర తమ విశ్వరూపం చూపిస్తారని విజయ్ చెప్పాడు. వాళ్ళకి  విజయాలు అపజయాలు కొత్తేమి కాదు.. రజినీకాంత్ గారికి వరసగా ఆరు ప్లాప్ లు వచ్చాయి. రీసెంట్ గా అయన నటించిన ‘జైలర్’ అనే సినిమా ఈరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు రూ.500 కోట్లు కలెక్ట్ చేసి ఇంకా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది., అందుకని వారు జయాపజయాల గురించి పట్టించుకోరని విజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్